కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మ‌హ‌త్య‌

– మొన్న భార్య.. నేడు భర్త..

కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 21: కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 18న ఆయన భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరు కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఉంటుండగా చంద్రశేఖర్ టూ టౌన్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. చంద్రశేఖర్ రోజు మాదిరిగా మంగళవారం ఇద్దరు పిల్లలను పాఠశాలలో వదిలి డ్యూటీకి వెళ్లాడు. కాగా ,దివ్య కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె గన్నేరు పూలు, ఆకులు మిక్సీ వేûసుకొని తాగింది. విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. సమాచారం తెలిసిన భర్త దివ్యను హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మతిచెందింది. కాగా, దివ్య మతికి చంద్రశేఖర్ కారణమని.. ఆమె అంత్యక్రియల సందర్భంగా ఎస్సైపై సీతంపేట గ్రామస్తులు దాడి చేశారు. ఆ సమయంలో ఆ దాడిని దివ్య తండ్రి అడ్డుకోవడం గమనార్హం. ఈ క్రమంలో భార్య మతిని తట్టుకోలేని చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *