హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 3: విధుల్లో ఉన్న ఎస్సై గుండెపోటుతో కుప్పకూలడం తీవ్ర విషాదాన్ని నింపింది. మంగళవారం అర్థరాత్రి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సంజయ్ సావంత్(58) మృతిచెందారు. సోమవారం రాత్రి డ్యూటీలో భాగంగా పోలీస్ స్టేషన్ బ్యారక్ లో పడుకుని ఉన్న సమయంలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలారు. విధుల్లో ఉన్న ఇతర కానిస్టేబుల్స్ వెంటనే సమీపంలోని కామినేని హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు తోటి పోలీసులు సమాచారం అందించారు.ఎస్సై సంజయ్ గత రెండేళ్లుగా ఎల్బీనగర్ పీఎస్‌లో పనిచేస్తున్నారు. 1989లో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన సంజయ్.. ఇటీవలే ఎస్సైగా పదోన్నతి పొందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. ఎస్సై మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బుధవారం పంచాయతీ ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉండటంతో ఎస్సై సంజయ్ మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లోనే నిద్రించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆయనకు ఎన్నికల డ్యూటీ కేటాయించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.