– హరీష్‌రావు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: గతంలో యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రవేశ పెట్టింది. దురదృష్టవశాత్తు తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ మోడల్ స్కూళ్లను రద్దు చేసింది. రద్దు చేసినా అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ మోడల్ స్కూళ్లను కొనసాగిస్తామని నిర్ణయం తీసుకున్నారని అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు గుర్తుచేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఈ మోడల్ స్కూల్ టీచర్ల కోసం జీవో నంబర్ 58, జీవో నంబర్ 60 ఇచ్చింది. వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీం లో లేరు. ఒకవేళ మోడల్ స్కూల్ టీచర్లు చనిపోతే సీపీఎస్ కింద గ్రాట్యుటీ ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 42 మంది మోడల్ స్కూల్ టీచర్లు చనిపోయారు. వారికీ గ్రాట్యుటీ అందించాలని కోరుతున్నామన్నారు. మోడల్ స్కూల్ టీచర్లు చనిపోతే వాళ్ళ పిల్లలకు కంపాసినేట్ అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో మోడల్ స్కూల్ ఉద్యోగులకు కంపాసినేట్ అపాయింట్‌మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మోడల్ స్కూల్ టీచర్లకు 17వ తేదీ వచ్చినా జీతాలు అందని పరిస్థితి, కావున వారికీ జీతాలు అందించాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. మోడల్ స్కూల్ ఉద్యోగులకు కూడా హెల్త్ స్కీమ్ అమలు చేయాలనీ కోరుతున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




