హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను షూటర్ ఈషా సింగ్ ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో భారత దేశ చరిత్రలో తొలిసారిగా బ్రాంజ్ మెడల్ సాధించి కొత్త రికార్డు సృష్టించిన నిజామాబాద్ బిడ్డ ఈషా సింగ్. ఆమెను మంత్రి సీతక్క హృదయపూర్వకంగా అభినందించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లలో రెండు సిల్వర్ మెడల్స్ సాధించిన ఈషా ప్రదర్శనపై మంత్రి ప్రశంసలు కురిపించారు. 70 దేశాల నుంచి 720 మంది అథ్లెట్లు పాల్గొన్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత పతాకాన్ని ఎగురవేసిన ఈషా ప్రతిభను మంత్రి ప్రశంసిస్తూ శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించాలని ఆశీర్వదించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





