హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: మహిళా షూటర్ ఈషా సింగ్ మంగళవారం శాంతి భద్రతల అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ ను డిజిపి కార్యాలయంలో కలిశారు. ఇటీవల ఈజిప్ట్ దేశ రాజధాని కైరో లో జరిగిన ప్రపంచ షూటింగ్ పోటీలలో బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడంతో పాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మిక్స్డ్ మరియు బృందం పోటీలలో మరో రెండు సిల్వర్ మెడల్స్ ని గెలుచుకున్నారు. దాదాపు 70 దేశాల నుండి 700 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో మూడు బహుమతులు గెలుచుకున్న ఈషా సింగ్ ని అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


