– సైదాపురంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 27: గ్రామ సర్పంచ్ ఎన్నికల వేళ ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు భారీ షాక్ తగిలింది. ఆయన సొంతూరు సైదాపురంలో ఆయన ప్రధాన అనుచరులైన కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పూలెపాక లావణ్య శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి సుమలతాశ్రీకాంత్, పూలెపాక నిరీక్షణారని, పూలెపాక మల్లేశ్, వినయ్, మౌనికామురళికృష్ణ, లక్ష్మీ,కోట ప్రవీణ్‌తోపాటు మరో వందమంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఅర్‌ఎస్‌లో చేరారు. పట్టణంలోని గొంగిడి నిలయంలో ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామాలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు అమలుపరచడంతో రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. గత రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, సైదాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు నంద సిద్ధయ్య, మాజీ ఎంపీటీసీ బీర్ల మహేశ్, సీనియర్ నాయకులు మానుపాటి కృష్ణ, పూలెపాక అశోక్, గంధమల్ల కుమార్, కొలకొప్పుల శ్రీనివాస్, తోటకూరి మల్లేశ్, ఆహ్మాద్, కనుకుల సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





