తళుకులీనుతున్న మేడారం

– నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పాటు
– జాతర కోసం రూ. 5 కోట్లతో విద్యుత్ శాఖ భారీ ఏర్పాట్లు
-» 350 మంది సిబ్బంది, 50 ప్రత్యేక బృందాలు సిద్ధం
– ‘స్కాడా’ ద్వారా హనుమకొండ నుంచే పర్యవేక్షణ
– ప్రమాదాల నివారణకు కవర్డ్ కండక్టర్ల ఏర్పాటు

ములుగు, ప్రజాతంత్ర, జనవరి 23: నిరం తర విద్యుత్ కాంతులతో మేడారం తళుకులీ నుతోంది. ప్రత్యేక ఏర్పాట్లతో రెప్పపాటు వి ద్యుత్ పోకుండా చర్యలు తీసుకున్నారు. జాతరలో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ అందించేందుకు రూ.5కోట్ల నిధులతో ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈనెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతర పరిసరాల్లో ఎటు చూసి నా విద్యుత్ కాంతులు జిగేల్ అంటున్నాయి. జాతరను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఐదు రోజులు నిర్విరామంగా విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే సత్వరమే పునరుద్ధరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జాతర పరిసరాల్లో ఎలాంటి అంతరాయలు లేకుండా ముందస్తుగా నివారించడంతోపాటు అనుకోకుండా అంతరాయం ఏర్పడితే సత్వరమే పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు 50 బృందాలను సిద్దం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన నార్లాపూర్ సబ్స్టేషన్ నుంచి పార్కింగ్ కేంద్రాలకు, పరిసర ప్రాంతాల్లోని దుకాణాలకు, గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

జాతర పరిధిలో 193 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయగా, కొత్తగా నార్లాపూర్లో రూ.2.50 కోట్లతో 33/11కేవీ సబ్ స్టేషన్ను నిర్మించారు. వీటిని రన్ చేసేందుకు ఆపరేషన్, ప్రాజెక్టు డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఇద్దరు సీజీఎంలు, ఏడుగురు డీఈలు, 20 మంది ఏడీఈ లు, 150మంది ఇంజనీర్లు, మెంటెనెన్స్ సిబ్బంది కలిపి 350 మంది వరకు విధుల్లో నిమగ్నం కాబోతున్నట్లు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం వెల్లడించింది. నాలుగు ట్రాన్స్ ఫార్మర్లకు ఒక బృందం చొప్పున పర్యవేక్షించనుంది. 33 కేవీ లైన్స్ పర్యవేక్షణకు తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట, చెల్పూర్, ఏటూరునాగారం, కమలాపూర్, ములుగు సబ్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని, ఇవే ప్రాంతాల్లోని ఈహెచ్లో సబ్స్టేషన్ల వద్ద విద్యుత్ సరఫరా పర్యవేక్షించేందుకు 20 మంది ఇంజనీర్లు, ఆపరేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పనుల కోసం సామగ్రిని తరలించేందుకు 30 వాహనాలను కేటాయించారు. విద్యుత్ వోల్టేజీ, ఫీడర్ లోడ్, అంతరాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్కాడా ద్వారా పర్యవేక్షించనున్నారు. దీనికోసం ఇప్పటికే మేడారంలోని రెండు 33/11 కేవీ సబ్ స్టేషన్లలో రియల్ టైం ఫీడర్ మేనేజింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా, వ్యాపారులు విద్యుత్ వైర్లకు కొక్కిలు వేయకుండా మేడారం, సమ్మక్క, సారక్క సబ్ స్టేషన్ల పరిధిలో 26 కిలోటర్ల మేర 11కేవీ లైన్స్, 15 కిలోటర్ల మేర 33కేవీ లైన్స్క ఓపెన్ కండక్టర్ స్థానంలో కవర్డ్ కండక్టర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్రమాదాల నిరోధానికి ఎన్టీ లైన్ల మధ్య స్పేసర్స్ ఏర్పాటు చేశారు. మేడారం, నార్లాపూర్, కొత్తూర్లోని సబ్స్టేషన్లను పస్రా 132/33 కేవీ సబ్ స్టేషన్కు అనుసంధానం చేశారు. ప్రత్యామ్నాయం కోసం ములుగు 132/33 కేవీ సబ్ స్టేషన్, కమలాపూర్ ఈహెచ్ టీ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పొందేలా ఏర్పాట్లు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *