టారిఫ్‌ ‌యుద్దాన్ని ముగించండి

– ట్రంప్‌కు శశిథరూర్‌ ‌సలహా

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబరు 4: ప్రపంచానికి అత్యవసరమైన భారత్‌-అమెరికా వ్యూహాత్మక బంధాన్ని కాపాడేందుకు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌టారిఫ్‌ ‌యుద్ధాన్ని ముగించాలని కాంగ్రెస్‌ ఎం‌పీ శశిథరూర్‌ ‌సూచించారు. అమెరికకా అధ్యక్షుడు న్యూదిల్లీని దూరం చేసుకొంటే క్వాడ్‌ ‌కూటమి బలహీనపడిపోతుందని ఆయన హెచ్చరించారు. ఓ ఆంగ్లపత్రికకు రాసిన వ్యాసంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ఫలితంగా ప్రాంతీయ భద్రతలో అస్థిరత ఏర్పడటమే కాకుండా, భారత్‌ అమెరికా వ్యతిరేక కూటమిలోని రష్యా, చైనాకు దగ్గరవుతుందన్నారు. వ్యూహాత్మక స్వతంత్ర వైఖరి అనేది సార్వభౌమాధికారమని అమెరికా గుర్తించాలన్నారు. భారత్‌ ‌కేవలం వాణిజ్య భాగస్వామే కాదు. అది ఇండో-పసిఫిక్‌లో నిర్ణయాత్మక పాత్ర పోషించే దేశం. న్యూదిల్లీని దూరం చేసుకొంటే క్వాడ్‌ ‌బలహీనపడే ప్రమాదం ఉంది. ఈ కూటమి సదస్సును భారత్‌ ‌త్వరలో నిర్వహించనుంది. ఏ దేశమైన జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకొంటుంది. తమ ఇంధన సరఫరాదారుల ఎంపిక.. లేదా ఆయుధ కొనుగోళ్లను విషయంలో భారత్‌ను శిక్షించడం సరికాదు. అవి ప్రతికూల ప్రభావం చూపుతాయని థరూర్‌ ‌పేర్కొన్నారు. భారత్‌-అమెరికా సంబంధాలు మెరుగుపడటానికి ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశారు. భారత్‌ ‌లేబర్‌ ‌మార్కెట్‌ను ప్రభావితం చేసే విధించిన టారిఫ్‌లను తొలగించడం, చర్చలను వేగవంతం చేయడం, అత్యున్నత స్థాయిలో దౌత్యాన్ని వేగవంతం చేయడం వంటివి పాటించాలన్నారు.  అంతకుముందు థరూర్‌ అల్‌ అరేబియా ఇంగ్లిష్‌తో మాట్లాడుతూ భారత్‌ 200ఏళ్ల పరాయి పాలనను మర్చిపోయి.. విధానాల తయారీలో విదేశీ జోక్యాన్ని అనుమతించే పరిస్థితి లేదన్నారు. ఈ టారిఫ్‌లు పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *