సివిల్స్ ‌తుది ఫలితాలు విడుదల

ఫస్ట్ ‌ర్యాంక్  సాధించిన శక్తి దూబె
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : ‌యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కషన్‌ ‌మంగళవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికిపైగా ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ ‌వంటి పోస్టుల భర్తీ కోసం గత ఏఢాది ఫిబ్రవరిలో యూపిఎస్‌సి నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. జూన్‌ 16‌వ తేదీన ప్రిలిమ్స్ ‌పరీక్ష నిర్వహించిన యూపిఎస్‌సి.. సెప్టెంబర్‌ 20 ‌నుంచి 29 తేదీ వరకూ మొయిన్స్ ‌నిర్వహించింది. మొయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17 ‌వరకు దశల వారీగా పర్సనల్‌ ఇం‌టర్వ్యూలు అయ్యాయి. తుది ఫలితాను మంగళవారం విడుదల చేసింది. 1009 మంది ఇందులో ఎంపిక కాగా.. జనరల్‌ ‌కేటగిరీలో 335, ఇడబ్ల్యూఎస్‌ 109, ఒబిసి 318, ఎస్సి కేటగిరీలో 160, ఎస్టి కేటగిరలో 87 మంది ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు తమ సత్తా చాటారు.

గత సంవత్సరం సివిల్స్ ‌పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారికి యూపీఎస్సీ గుడ్‌ ‌న్యూస్‌ అం‌దించింది. యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌సివిల్‌ ‌సర్వీసెస్‌ ‌పరీక్షల తుది ఫలితాలను ప్రకటించింది. ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ‌సర్వీస్‌, ఇం‌డియన్‌ ‌ఫారిన్‌ ‌సర్వీస్‌, ఇం‌డియన్‌ ‌పోలీస్‌ ‌సర్వీస్‌, ‌వివిధ గ్రూప్‌ ’ఆ’, ‌గ్రూప్‌ ’ఇ’ ‌సెంట్రల్‌ ‌సర్వీసెస్‌లకు నియామకాలకు మొత్తం 1,009 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఫలితాల్లో శక్తి దూబే ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇ. సాయి శివాని 11, బన్నా వెంకటేశ్‌ 15, అభిషేక్‌ ‌శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి 62 , సాయి చైతన్య జాదవ్‌ 68, ఎన్‌ ‌చేతన్‌ ‌రెడ్డి 110, చెన్నం రెడ్డి శివగణేష్‌ ‌రెడ్డి 119వ ర్యాంకులతో సత్తా చాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *