పువర్తి గ్రామంలో విషాదఛాయలు

– హిడ్మా దంప‌తుల మృత‌దేహాలు కుటుంబీకులకు అప్పగింత
– కన్నీరుమున్నీరైన తల్లి మాంజు, కుటుంబ సభ్యులు
– కడసారి చూసేందుకు వచ్చిన గ్రామ ప్రజలు
-క న్నీతో వీడ్కోలు

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ఆం‌ద్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాలలో మంగళవారం నాడు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కేంద్రకమిటీసభ్యులు మాడవి హిడ్మా అతని భార్య రాజేలు మృతిచెందడం తెలిసిందే. \మృతదేహాలను రెండురోజుల తరువాత రంపచోడవరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి గురువారం వారి స్వగ్రామమైన ఛ‌త్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పునవర్తి గ్రామంలోని వారి కుటుంబీకుల‌కు అప్పగించారు. హిడ్మా మృతదేహాన్ని చూసిన తల్లి మాంజు కన్నీరుమున్నీరుగా విలపించారు.దీంతో ఆ గ్రామంలో విషాదాయలు అలుముకున్నాయి. హిడ్మా మృతదేహాన్ని చూసేందుకు పునవర్తి గ్రామంలో కుటుంభీకులు మృత దేహం వద్ద బోరున విలపించారు. ఒక సమయంలో నాకొడుకా లొంగిపోమని చెప్పాను.ఎందుకు ఇలాచేసావ‌ని బోరున తల్లి మాంజు విలపించింది. అంతకు ముందు  మడివి హిడ్మా, ఆయన భార్య రాజే మృతదేహాలకు పటిష్ట భద్రత నడుమ బుధవారం రంపచోడవరం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవ్వరినీ రానీయకుండా సాయుధ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. హిడ్మా, రాజేలను కడసారి చూసుకునేందుకు వారి కుటుంబీకులు సుక్మా జిల్లా నుంచి బుధవారం మధ్యాహ్నానికి రంపచోడవరం చేరుకున్నారు. హిడ్మా సోదరుడు మడవి హంగా, కుటుంబీకులు దోడి జోగా, బడిసే ఇడిమ, రాజే సోదరి జోడి లలిత, కుటుంబీకుడు మార్కం లలిత్‌ ‌కుమార్‌ ‌వచ్చారు. వారిని మాత్రమే పోలీసులు మార్చురీ వద్దకు పంపించారు. పువర్తి గ్రామం మావోయిస్టు చరిత్రలో కీలక స్థానం ఉన్నదిగా భావిస్తారు. 50 ఇళ్లే ఉన్న గ్రామం నుంచి ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టుల్లోకి మార్చిన హిడ్మా ఇక్కడి యువతపై తీవ్ర ప్రభావం చూపాడని భద్రతా సంస్థలు పేర్కొంటాయి. హిడ్మా తరువాత ఈ గ్రామానికి చెందిన మరో వాంటెడ్‌ ‌మావోయిస్టు బార్స దేవా కీలక నేతగా ఉన్నాడు. ఈ ప్రాంతం చాలా కాలంగా మావోయిస్టుల నియంత్రణలో ఉండటంతో భద్రతా వ్యవస్థలు ఇక్కడ ప్రవేశించలేకపోయాయి. దశాబ్దాల తర్వాత ఏడాది క్రితమే సీఆర్‌పీఎఫ్‌ ఈ ‌ప్రాంతంలో బేస్‌ ‌క్యాంప్‌ను ఏర్పాటు చేసింది,


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page