– 33 మంది బాలలకు నరకం చూపిన దంపతులు
– మరణ శిక్ష విధించిన కోర్టు
లక్నో,ఫిబ్రవరి21: అభంశుభం తెలియని పసి పిల్లలపై కొందరు మానవ మృగాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో దంపతులకు మరణశిక్ష పడింది. పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఆ దృశ్యాలను చిత్రీకరించి విదేశాలకు పంపించిన ఈ నరరూప రాక్షస దంపతులకు సరైన శిక్షపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రామ్ భవాన్.. చిత్రకూట్ జిల్లాలో గతంలో నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో తన భార్య దుర్గావతితో కలిసి 2010-2020 మధ్య బందా, చిత్రకూట్ ప్రాంతాల్లో బాలురపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. వీరి దారుణాలకు బలైన వారిలో మూడేళ్ల వయసు చిన్నారులు కూడా ఉన్నారు. ఆన్‌లైన్ వీడియో గేమ్స్, బహుమతులు, తినుబండారాల పేరుతో పిల్లలను మభ్యపెట్టి ఇంటికి రప్పించి ఈ దారుణాలకు ఒడిగట్టారు. ఈ దంపతుల దారుణాలకు సంబంధించిన 2 లక్షల వీడియోలు, ఫొటోలను ఇంటర్నెట్ ద్వారా 47 దేశాలకు పంపించారు. నిందితులపై సీబీఐ 2020 అక్టోబరులో కేసు నమోదు చేసింది. మైనర్ బాధితుల పట్ల సీబీఐ దర్యాప్తు సున్నితంగానే కొనసాగింది. రామ్ భవాన్, అతడి భార్యపై 2021 ఫిబ్రవరిలో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ దంపతుల నుంచి ప్రాణాలతో బయటపడిన పిల్లల్లో కొందరి ప్రైవేట్ భాగాలపై గాయాలు అయ్యాయని, వారిలో కొందరు ఏళ్ల తరబడి ఆసుపత్రులలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఐదేళ్ల పాటు యూపీలోని పోక్సో కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. తాజాగా కోర్టు తుది తీర్పును వెల్లడించింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా పోక్సో కోర్టు అభివర్ణించింది. ఈ కేసులో నిందితులైన మాజీ ఇంజినీరు దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అలానే బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




