బంజారా భవన్‌లో రేపు సేవాలాల్ జయంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. ఉత్సవాలలో రాష్ట్ర
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని గిరిజన సంక్షేమ శాU మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా లంబాడీ గిరిజన సంప్రదాయ పద్ధతి ప్రకారం సంత్ సేవాలాల్ ఆరాధన (భోగ్ భండార్) కార్యక్రమాలు, గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, గిరిజన హస్తకళల ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఇప్పటి వరకు వేడుకలకు ఖర్చు పెడుతున్న రూ.కోటిని రూ.2 కోట్లుగా ముఖ్యమంత్రి రెట్టింపు చేయడమే కాÅ£ బంజారా ఉద్యోగులకు ఫిబ్రవరి 15నాడు ప్రత్యేక సెలవు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాలలో సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గిరిజన ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అందరికీ ఆహ్వానం పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *