– కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద హెచ్చరికలు ఏర్పాటు చేయాలి
– అత్యవసరమైతే తప్ప ఎవరూ సెలవు తీసుకోవద్దు
– మొంథా తుఫాను నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి సూచనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: మొంథా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలను అప్రమత్తం చేయడానికి పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పిఆర్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని, లో కాజ్ వేలు, కల్వర్టుల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బి ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్‌తో అన్ని జిల్లాలను అనుసంధానం చేయాలన్నారు. అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని, అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్‌అండ్‌బి శాఖ ఈఎన్సీలు, సీఈలు, ఎస్‌ఈలతో మంత్రి మంత్రి బుధవారం ఫోన్‌లో మాట్లాడి అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ప్రతి ఒక్కరూ ఫీల్డ్ లెవెల్‌లో హై అలెర్ట్‌గా ఉండాలనీ, అత్యవసరం అయితే తప్ప ఎవరూ సెలవుపై వెళ్లొద్దని మంత్రి సూచించారు. మాన్సూన్ సీజన్‌లో ఇంజనీర్లు క్షేత్ర స్థాయిలో చేపట్టిన జాగ్రత్త చర్యలు ప్రశంసనీయమని, అదే స్పూర్తిని ఈ సమయంలో కూడా కొనసాగించాలనీ కోరారు. ఆర్ అండ్‌బి సర్కిల్ వారీగా అన్ని జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలనీ, అందుకు తగ్గ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





