– రెయిన్‌బోహోమ్స్ వార్షికోత్సవంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయిన చిన్నారులను ఆదరించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న రెయిన్‌బోహోమ్స్ దాతృత్వం చాలా గొప్పదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కొనియాడారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన రెయిన్‌బో హోమ్స్ వార్షికోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవ సేవే మాధవసేవ అంటూ అనాధ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రెయిన్‌బోహోమ్స్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించాలని, పిల్లలకు విద్యాబుద్ధులతోపాటు క్రీడలు, ఇతర కళల్లో మంచి శిక్షణ ఇస్తున్నారని మెచ్చుకున్నారు. రెయిన్‌బో వంటి అనాధ ఆశ్రమాలకు ప్రభుత్వం తరఫున సహకరిస్తామన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తనకు కూడా బాధ్యత ఉందన్నారు. పిల్లలు, మీరు (సంస్థ నిర్వాహకులు) ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి సీతక్క అవార్డులు ప్రదానం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




