– రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య
వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విద్యారణ్యపురి పక్షాన వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం నియమావళి-2011 అనుసరించి గురువారం శిక్షణ నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య అధ్యక్షత వహించారు. 2007 తల్లిదండ్రులు వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం నియమాలు-2011లో వృద్ధుల ఫిర్యాదులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించుటకు నియమావళిని రూపొందించారని, వయోవృద్ధుల ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించుటకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ మిత్ర వృద్ధుల స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. వచ్చిన ఫిర్యాదులను కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుటకు, ఆయా స్టేషన్‌ల పరిధిలో నివసిస్తున్న వృద్ధుల సమాచారం సేకరించి దాన్ని భద్రపరుచుట పోలీస్ స్టేషన్ బాధ్యత అని వివరించారు. వృద్ధుల సమస్యలను పరిష్కరించుటకు పోలీస్ స్టేషన్ పనిచేయాలని డీజీపీ విధివిధానాలను రూపొందించారని, వృద్ధ మిత్ర వృద్ధుల స్వచ్ఛంద కమిటీలలో నియమావళిననుసరించి ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి, మహిళా ప్రతినిధి , ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఇద్దరితో కమిటీని ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారని నర్సయ్య తెలిపారు. చట్టంలో పొందుపరిచిన 5వ అధ్యాయంలోని సెక్షన్ 21 ననుసరించి వారి ప్రాణ, ఆస్తికి రక్షణ కల్పించాలని సూచించారు. వృద్ధుల స్వచ్ఛంద కమిటీలను బలోపేతం చేయుట ద్వారా వృద్ధులలో భరోసాను, మనోధైర్యాన్ని కల్పించిన వారవుతారని విజ్ఞప్తి చేశారు. మా సంస్థ పక్షాన గ్రామాలలో మరియు మండల స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించుటకు తమ సంపూర్ణ సహకారాలు అందించవలసినదిగా ఈ సందర్భంగా సీనియర్ సీజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు స్టేషన్ ఆఫీసర్లకి మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసులకి అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసులకు విజ్ఞప్తి చేసి ఉన్నారు శిక్షణలో పాల్గొనిన ఎస్‌హెచ్‌వోలకు 2007 చట్టం నియమావళి పుస్తకాలను అందించారు. ఎస్‌హెచ్‌ఓలు తగువిధంగా స్పందించినందుకు కార్యదర్శి తేరాల యుగంధర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యఅతిథిగా అడిషనల్ డీసీపీ రవి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





