పంట కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం

– సిద్దిపేట యార్డులో రైతుల ఆందోళన
– సందర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పంట కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డును హరీష్ రావు శనివారం సందర్శించారు. నాలుగు రోజులుగా పొద్దు తిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆయనకు విన్నవించారు. అన్నదాతల సమస్యలు విని అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని ధ్వజమెత్తారు. నారాయణఖేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులను అధికారులు సందర్శించాలన్నారు. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పంట మార్పిడి చేయమంటున్నారు.. కానీ పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దిక్కు లేదన్నారు. పలు జిల్లాల్లో వడగళ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సమయానికి రైతు బంధు ఇవ్వాలని కోరారు. బీసీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బీసీ డిక్లరేషన్ పేరుతో రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని కుల వృత్తులను ప్రోత్సహించామని చెప్పారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *