రామచందర్‌రావుకు సీనియర్‌ నాయకుల అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్‌.రామచందర్‌రావును పార్టీ సీనియర్‌ నాయకులు డాక్టర్‌ ట.ి రాజేశ్వరరావు, వెంకటరమణి, చింత సాంబమూర్తి, రామకృష్ణారెడ్డి, పి. సుగుణాకర్‌రావు, ధర్మారావు, మల్లారెడ్డి, పాపారావు తదితరులు కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రామచందర్‌రావు నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. రామచందర్‌రావు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తామందరం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఎన్నోఏళ్లుగా అష్టకష్టాలకోర్చి పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులను గుర్తిస్తూ ప్రజాబలం ఉన్న కొత్త నాయకులను పార్టీలో చేర్చుకుని పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని సీనియర్‌ నాయకులు రామచందర్‌రావుకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *