– ఆసిఫాబాద్ కలెక్టర్‌కు హెచ్ఆర్సీ ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్ సీ) ఈనెల 3న ఓ పత్రికలో ప్రచురితమైన ఎల్లూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్ వార్తపై స్వయంగా విచారణకు స్వీకరించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్లూరు గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడంతో ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురవగా కాగజ్‌నగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించినట్లు వార్త వచ్చింది. ఆహారం విషయంలో నిర్లక్ష్యం ఉన్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నదని కమిషన్ భావిస్తూ ఇది ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చిన జీవనం, ఆరోగ్యం, గౌరవ హక్కులకు భంగం కలిగించే అంశమని పేర్కొంది. ఈ మేరకు ఈనెల 27లోగా నివేదిక పంపాలని కమిషన్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



