– 20మంది ముఠా సభ్యులను పట్టుకున్నాం
– మాదాపూర్ డీసీపీ రితు రాజ్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్ డీసీపీ రితు రాజ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాలలో విక్రయించారు. దాదాపు 20 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నాం. ముఠాలో సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించిన నిందితులు ఉన్నట్టు గుర్తించాం. సృష్టి కేసులో బెయిల్‌పై వచ్చి చిన్నారులను విక్రయిస్తున్నారు. ఒక్కో చిన్నారిని రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని డీసీపీ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 15 మంది పిల్లలను అమ్మిన ముఠాను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో శిశువులను విక్రయిస్తున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నగరంలోని ఎనిమిది ఆస్పత్రులకు ఏజెంట్లగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నుంచి ఇద్దరు బాలలను ఎస్వోటీ పోలీసులు కాపాడారు. అంతే కాకుండా ఒక్కొక్క శిశువు అమ్మకం వెనకాల రూ.15 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.