ఆత్మనిర్భర భారత్‌కు ఐటిఐలు కీలకం

– ‘శ్రమయేవ జయతే.. శ్రమయేవ పూజ్యతే’ సాకారం
– కౌశల్‌ దీక్షాంత్‌ సమరోప్‌ాలో ప్రధాని మోదీ
– బీహార్‌లో ప్రారంభించిన సీఎం నితీశ్‌ కుమార్‌

న్యూదిల్లీ, అక్టోబర్‌ 4: ఇండస్టియ్రల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు (ఐటీఐ) ఆత్మనిర్భర్‌ భారత్‌కు కీలకమైన వర్క్‌షాప్‌లు అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. యువత సాధికారతకు మెగా ప్రోగ్రామ్‌గా ఈ ఈవెంట్‌ను అభివర్ణించారు. ’శ్రమయేవ జయతే.. శ్రమయేవ పూజ్యతే’ అని ఉటంకిస్తూ నైపుణ్యం కలవారిని గౌరవించాలని సూచించారు. ఈ సందర్భంగా రూ.62,000 కోట్లకు పైగా విలువైన యువత` కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని శనివారం దిల్లీలో ప్రారంభించి విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కౌశల్‌ దీక్షాంత్‌ సమరోప్‌ాలో మాట్లాడారు. యువతలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధాన మంత్రి సేతు పథకాన్ని రూ.60,000 కోట్లతో ప్రవేశపెట్టారు. దేశంలో 2014 వరకు పది వేల ఐటీఐలు ఉండగా గత దశాబ్దంలో కొత్తగా ఐదు వేల ఐటీఐలు ఏర్పాటు చేశారని, ఈ 11 సంవత్సరాల్లో 1.5 కోట్ల మంది యువకులకు స్థానిక భాషల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చారని ప్రధాని తెలిపారు. అటు బీహార్‌లోనూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ యువత సాధికారతను ప్రతిష్ఠాత్మకంగా నిర్వర్తిస్తున్నారు. నిశ్చయ్‌ స్వయం సహాయతా భత్తా యోజనను ఆధునికీకరించి యేటా ఐదు లక్షల మంది గ్రాడ్యుయేట్లకు రూ.1,000 నెలవారీ స్కాలర్‌షిప్‌ను రెండేళ్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో యువతకు ఫ్రీ స్కిల్‌ ట్రైనింగ్‌ అందిస్తున్నారు. అంతేకాక బీహార్‌ స్టూడెంట్‌ క్రెడిట్‌ కార్డ్‌ స్కీమ్‌ను రీ డిజైన్‌ చేసి యువతకు రూ.4 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా 3.92 లక్షల మంది రూ.7,880 కోట్ల రుణాలు పొందారు. గత రెండేళ్లలో బీహార్‌ ప్రభుత్వం 50 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని ప్రధాని చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల పాలనతో పోలిస్తే నితీశ్‌ ప్రభుత్వం విద్యా బ్జడెట్‌ను అనేక రెట్లు పెంచిందన్నారు. అందువల్లే నేడు మారుమూల గ్రామాల్లో కూడా పాఠశాలలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని 19 జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలను కేంద్రం ఆమోదించిందని తెలిపారు. దేశంలోనే బీహార్‌లో అత్యధిక యువ జనాభా ఉందని, ఇక్కడి యువత సామర్థ్యం పెరిగితే సహజంగానే దేశ బలం కూడా పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో ఏళ్లు యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దాంతో దేశంలో అభివృద్ధి కుంటుపడిరదని మోదీ మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *