దేశపు మోహనం – మన్మోహనం

పుట్టింది పాత పంజాబ్‌లోని
సిక్కుల కుటుంబం
గడిపింది సాధారణ
మధ్యతరగతి జీవనం
తన విద్వత్తుతో విశ్వానికి సమాధానం
మనసంతా జ్ఞానం నిండిన మాటల మౌనం
దేశానికి స్వేచ్చనిచ్చిన ఆర్థిక పరిజ్ఞానం
ప్రపంచీకరణకు బాటలు
వేసిన ధీరత్వం
ప్రధానిగా ప్రారంభించిన
వంద రోజుల పని విధానం

కేంబ్రిడ్జ్‌ నుండి కుగ్రామం
వరకు తన ముద్ర వేసిన
మహనీయుడుజి
ఆక్ఫర్డ్‌ నుండి అన్నదాత
హృదయం వరకు
పయనించిన మేధావి

స్వేచ్ఛ స్వాతంత్య్రాల నుండి
ప్రపంచీకరణకు భారత్‌ ను
నడిపించిన ధీరుడు…

సంక్షిష్టత నుండి సరళీకరణకు
బాటలు వేసిన వృద్ధి చోదకుడు

అడుగులో అడుగు వేస్తూ
మందగమనంలో నడుస్తున్న
భారత ఆర్థిక వ్యవస్థను
ఛలో ఛలో అంటూ
ఉరకలెత్తించిన ప్రగతి కాముకుడు

ఉన్నత విద్యకు ఊతమిచ్చే
యుజిసి చైర్మన్‌
బ్యాంకులకు బాంకైన
కేంద్ర బ్యాంకు గవర్నర్‌
వృద్ధిదిశగా అడుగేయించిన
ప్రణాళిక డిప్యూటీ చై్మన్‌

మన ఈ ఆర్థిక సలహా దారు
దేశానికి హార్దిక కాపలా దారు

అణుశక్తి కమిషన్‌ కు అయినా
అంతర్జాతీయ రాయబారానికి
అయినా అద్వితీయ ప్రతిభ
చూపించిన విజ్ఞానఖని

ఆక్సిడెంటల్‌ ప్రధాని అయినా
అత్యుత్తమ నిర్ణయాలు
ఆర్థికవేత్తగా తీసుకున్న
అడం స్మిత్‌ ఆసియా పురస్కారాలు
ఆర్థికమంత్రిగా దేశానికి
అద్భుత సంస్కరణలు

టీచర్‌ గా మొదలయ్యి
అనేక పదవుల మీదుగా
ఫిలాసఫర్‌ గా మాయమైన
ఈ శ్రీ మన్మోహన్‌ సింగ్‌
ఎప్పటికీ మన దేశపు
నిరంతర అభివృద్ధి గెయినింగ్‌

-శ్రావణసంధ్య 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *