రైజింగ్ తెలంగాణ..శాంతి భద్రతలో తెలంగాణ నెంబర్ వన్..తెలంగాణ పోలీస్ ప్రపంచానికే ఆదర్శం..శాంతి భద్రతల విషయంలో రాజీపడం..ఇది తెలంగాణ ప్రభుత్వం చెపుతున్న మాటలు..రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలోనే నేరాలు తగ్గాయి..నేరస్తుల సంఖ్య తగ్గింది..రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు..శాంతి భద్రతలు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లు సాగుతుంది..తెలంగాణ పోలీసులు అంతర్జాతీయ అవార్డ్‌లు పొంతున్నారు..
కానీ వాస్తవానికి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి..రాష్ట్రంలో నేరాలు చాపకింద నీరులా పెరుగున్నాయి..ఏకంగా మిట్ట మధ్యాహ్నం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నడిరోడ్డులపై హత్యలు జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారు పెరుగుతున్నాయి.చివరి పోలీస్ స్టేషన్లలో కూడా మహిళలకు భద్రతలేని పరిస్థితి ఏర్పడింది. .పోలీస్ స్టేషన్‌లో మహిళలు ఇబ్బంది పడ్డ అనేక వార్తలు వెలుగులోకి వచ్చాయి..హత్యలతో హైదరాబాద్ తెల్లారుతుందని..ఈ నగరానికి ఏమైందన్న హెల్డ్ లైన్స్ తో న్యూస్ పేపర్లకు బ్యానర్ ఐటమ్స్ అయ్యింది.
తాజాగా రాజ్‌భవన్‌లో చోరీ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది. గవర్నర్ భవన్‌లో హార్డ్ డిస్క్ ల చోరీ రాష్ట్రంలో భద్రతా వైఫల్యాలకు అద్దం పడుతుంది..రాష్ట్రానికి, దేశానికి కూడా కీలకమైన రాజ్ భవన్‌లో భద్రతా లోపం రాష్ట్ర పోలీస్ శాఖ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తుంది..రాజ్ భవన్ లోని మొదటి అంతస్తులోని సుధర్మ భవన్ లో హార్డ్ డిస్క్‌ల అపహరణ ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చనీయాంశంగా మారింది. .రాజ్‌భవన్ అన్నది అంత్యంత శత్రు దుర్భేద్యమైన ప్రాంతం. రాజ్యాంగ పరి రక్షకుడు, రాష్ట్ర ప్రథమ పౌరుడు నివాసం ఉండే ప్రదేశం.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పాలనపమైన వారధిగా రాజ్‌భవన్ ఉంటుంది. రాష్ట్రపతికి ఎన్ని అధికారాలు ఉంటాయో..రాష్ట్రంలో గవర్నర్‌కు అన్ని అధికారాలు రాజ్యాంగం కల్పించింది..దేశ పాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద జరిగితే.రాష్ట్రంలో గవర్నర్ పేరు మీద జరుగుతుంది. .నిజానికి రాష్ట్రపతి భవన్ దేశానికి .. రాజ్‌భవన్ లు రాష్ట్రాలకు గుండెకాల్లాంటివి..అలాంటిది రాజ్‌భవన్‌లో చోరీ జరిగిందంటే అది గవర్నర్ ఆఫీస్‌లో దొంగతనంగా చూడాటానికి లేదు..అది మొత్తం రాష్ట్రంపై చోరీగా చూడాలి..రాజ్‌భవన్ అంటే గవర్నర్ ఉండే అధికారిక నివాసమే కాదు..రాష్ట్ర ఆత్మ, రాష్ట్ర పాలన కేంద్రం, ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్న రాజ్‌భవన్ ముద్ర ఉండాల్సిందే..అలాంటి రాజ్‌భవన్‌లో చోరీ అంటే రాష్ట్ర ప్రభుత్వంలోనే చోరీ అన్నట్లు చూడాలి.
రాష్ట్ర ప్రభుత్వ పాలనకు రాజ్‌భవన్ అత్యంత వ్యూహత్మక ప్రదేశం..శత్రు దుర్భేద్యమైన ప్రదేశమే కాదు..నిత్యం కేంద్ర, రాష్ట్ర త్రివిధ దళాల నిఘా నీడలో ఉంటుంది..రాజ్‌భవన్‌లో చీమ చిటుక్కుమన్న క్షణాల్లో రాష్ట్రపతి భవన్, రాష్ట్ర పోలీస్ శాఖ అలర్ట్ అవుతుంది..త్రివిధ దశాలు అప్రమత్తం అవుతాయి. అలాంటిది తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్క్‌లు మాయం కావడం అంటే రాష్ట్రంలో పోలీస్ శాఖ పని తీరు ఏలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. .రాష్ట్ర ప్రథమ పౌరుడు, రాజ్యాంగ పరిరక్షకుడు, ప్రజాస్వామ్యాన్ని అమలు చేసే రాజ్‌భవన్‌లో రక్షణ లేకపోతే. రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటీ..?..దొంగ దైర్యాంగా రాజ్‌భవన్‌లో చోరీ చేస్తే ఇక రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఏందీ. రాజ్‌భవన్‌లో భద్రతా లోపాలు భయటపడితే రాష్ట్రం సురక్షితంగా ఉందని ఏలా అనుకోగలం..?.నిత్యం త్రివిధ దళాలు ,పోలీసులు రక్షణ ఉండే రాజ్ భవన్‌లో దుండగుడు చోరీ చేస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుల ఇళ్ల రక్షణ ఎక్కడుంది..?.ప్రజల మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుంది..?.
.రాజ్‌భవన్‌లో రాష్ట్రానికి దేశానికి సంబంధించిన కీలక విషయాలు ఉంటాయి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉంటాయి..రాష్ట్రం, దేశ భద్రతలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అక్కడ ఉంటుంది.రాష్ట్ర, కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చే నివేదికలు ఉంటాయి..కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అనేక రహస్య నివేదకలు ఉంటాయి.ప్రత్యేకంగా రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి భవన్ మధ్య జరిగే కీలకమైన రహస్య పత్యాలు మార్పిడికి సంబంధించిన వివరాలు ఉంటాయి.గవర్నర్‌కు కేంద్రానికి గోప్యంగా జరిగిన చర్చలు ఉంటాయి..ఇక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం, దేశం అంతర్గత, బాహ్య విషయాలు రాజ్‌భవన్‌లో ఉంటాయి. .రాజ్‌భవన్‌లో చోరీ జరగడం అంటే దేశ రాష్ట్ర భద్రతలకు ప్రమాదం పొంచి ఉన్నట్లే.. గవర్నర్ అధికారిక నివాసం నుంచి కీలకమైన హార్డ్ డిస్క్‌లు చోరీ జరగడం అంటే దేశ రహస్యాలు అపహరణకు గురి కావడమే.ఇది దేశ ద్రోహానికి పాల్పడటమే అవుతుంది. అంతేకాదు రాష్ట్ర పర్యటనకు ప్రధాన మంత్రి వచ్చిన, రాష్ట్రపతి వచ్చిన ఖచ్చింతగా రాజ్‌భవన్‌లోనే స్టే చేయాల్సి ఉంటుంది. రాజ్‌భవన్ మించిన భద్రత మరెక్కడ ఉండదు అందుకే రాష్ట్రానికి సుప్రీం సీజేఐ వచ్చిన కీలకమైన రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్నవారు, విధేశీ రాయబారులు, మంత్రులు ప్రధాన మంత్రులు ,అధ్యక్షుడు వచ్చిన రాజ్‌భవన్‌లో బస చేయాల్సి ఉంటుంది..వారి కార్యక్రమాలను రాజ్‌భవన్ ట్రాక్ మానిటరింగ్ చేస్తుంది..అలాంటి చోట భద్రత వైఫల్యాలు బయడపడటం, ఏకంగా రాజ్‌భవన్ నుంచి హార్డ్ డిస్క్‌లు దైర్యంగా ఒక దొంగ ఎత్తుకెళ్లాడంటే రాష్ట్ర ప్రతిష్ట మసకబారడమేకాదు..దేశ భద్రతకు ముప్పు ఉందని చెప్పవచ్చు.రాష్ట్రంలో రాజ్‌భవన్ భద్రతా ప్రశ్నార్ధకంగా మారింది.
.ఒకవైపు దేశంలో కొంత మంది దేశ రహస్యలు పాకిస్తాన్ వంటి దేశాలకు చేరవేస్తున్నారన్న చర్చ జరుగుతుంది..పాక్ ఏజెంట్స్‌గా ఉంటూ దేశ సైనిక భద్రత విషయాలు, పౌరుల డేటాను శత్రువు దేశాలకు పంపిస్తున్నారన్న ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ జరగడం, ముఖ్యమైన హార్డ్ డిస్క్‌లు ఎత్తుకేళ్లడం ఇప్పుడు రాష్ట్రంలోనే దేశ వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. . రాజ్ భవన్‌లో చోరీ అంటే అంత ఆశామాషీ విషయం కాదు..అయితే చోరీకి గురైన హార్డ్ డిస్క్‌లో ఏం ఉంది..? అది ఎవరి ప్రయోజానాల కోసం చోరీ చేయబడింది..అందులో ఎవరి పాత్ర ఎంత..? రాష్ట్ర భద్రతకు సంబంధించి, దేశ భద్రత గురించి ఏమైనా కీలక విషయాలు ఉన్నాయా..? చోరీ చేసిన హర్డ్ డిస్క్ లు ఎవరి వద్దకు వెళ్లాయి..? వారికి ఆ హర్డ్ డిస్క్‌లో పనేంటి..?..వారి నేపథ్యం ఏంటి..? ఇలా అన్ని కోణంలో దర్యాప్తు జరిగాలి.. రాజ్‌భవన్‌లో తెలంగాణ పోలీసుల భద్రత వైఫల్యం క్లీయర్‌గా బయటపడింది. అందుకే ఈ చోరీ కేసును సీబీఐతో విచారణ చేయాలి..ఎన్ ఐ ఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థకు కేసు అప్పగించాలి..ఎందుకంటే రాజ్‌భవన్‌లో చోరీ అంటే భారీ ప్లాన్ ఏదో ఉండి ఉంటుంది.
.ఇంకోవైపు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి కార్యకర్తల్లా పని చేయడం మానేయాలి.. ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలి..ప్రతిపక్షాలపై, ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ శాంతి భద్రతలు కాపాడాలి.. రాజ్‌భవన్‌లో చోరీ అనేది పోలీస్ శాఖకు చరిత్రలో తీరని మచ్చగా మిగిలిపోతుంది. విపక్షాలపై, జర్నలిస్ట్‌లపై పౌరసమాజంపై కేసులు పెట్టడంతో తెలంగాణ రైజ్ అవుతుంది కానీ, శాంతిభద్రత అంశంలో ఫాల్ అవుతుంది..ఇప్పటికైన పోలీస్ శాఖ రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టాలి..ప్రజల్లో తెలంగాణ పోలీస్‌పై నమ్మకాన్ని నిలుపుకోవాలి..అంతర్జాతీయ అవార్డ్ లు ఎన్ని వచ్చిన రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడకపోతే అవన్నీ వృధానే..
– తోటకూర రమేష్





