“హిందు మతంలో ఉన్న అనాగరిక అంశాలను ప్రశ్నిస్తున్న వారిపై మూక దాడులు చేస్తూ హత్య చేయడమే మతోన్మాదులు ఎజెండా పెట్టుకున్నారు. కర్నాకటలో గౌరి లంకేశ్ హత్యలో మొదలైన మూక హత్యలు ఇప్పుడు ఏకంగా భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్దాపై దాడి చేసే దాకా వచ్చింది. ఏకంగా కోర్ట్ హాల్‌లోనే కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా సీజేఐపై దాడికి మతోన్మాద అడ్వకేట్ ప్రయత్నించారు. ఏకంగా జస్టిస్ గవాయ్‌పై బూటుతో దాడికి దిగాడు..”
ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే దాడికి యత్నం
దేశంలో మతోన్మాదం ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిచేసే దశకు చేరుకోవడం రాబోయే రోజుల్లో ప్రమాదఘంటికలకు సంకేతం. మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై దాడులు పెరుగుతున్నా యడా న్ని ఇది స్పష్టం చేస్తున్నది. గత దశాబ్ద కాలంలో దేశంలో కొన్ని వందల మందిని మతోన్మాదులు హత్య చేశారు. లక్షల మందిపై దాడులు చేసి తీవ్రంగా గాయపర్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో మత రాజకీయాలు, ఉన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. ఆమూకకు చెందిన వ్యక్తే ఇప్పుడు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై కోర్ట్ హాల్‌లోనే దాడికి యత్నించారుపె. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే మతాన్ని అధికారికంగా ప్రచారం చేస్తూ, మత సంస్థలను, మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోంది.
ఫలితంగా లౌకికవాదాన్ని వ్యతిరేకించే పాలన కొనసాగుతోంది. హిందు రాజ్య స్థాపన కోసం, సనాతన ధర్మం పేరుతో ఏకంగా దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతోంది. కేవలం అధికారం కోసం మతాన్ని ప్రధాన అజెండాగా అమలు చేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, లౌకికవాదినికి పూర్తి విరుద్ధం. గత కొన్ని దశాబ్దాలుగా సెక్యూలర్ ఇండియాను హిందూ భారత్ గా మార్చే కుట్రలు జరుతున్నా యి. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ దేశంలోని అన్నీ ప్రజాస్వామ్య రాజ్యాంగ బద్దమైన సంస్థలను కాషాయికరిస్తూ, ఒక్కొక్క వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ సనాతన ధర్మం పేరుతో వాటిని బలహీనపరుస్తోంది ఈ నేపథ్యంలో లౌకికవాదం గురించి, ప్రజాస్వామ్య గురించి మాట్లాడే, రాసే, పాడే వారిపై మతోన్మాదులు దాడులకు తెగడుతున్నారు.
లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టులు, అభ్యుదయం గురించి ప్రచారం చేసేవారిపై రైట్ వింగ్ యాక్టివిస్టులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. 2047నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అవుతుంది. ఈలోపు దేశాన్ని హిందు దేశాంగా మార్చేందుకు కాషాయ మూకలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ప్రయత్నాలు మరింత పెంచింది. దేశంలో బీజేపీ ఆధికారంలోకి వచ్చాక మతోన్మాద రాజకీయాలు ఎక్కువవయ్యాయి. దేశంలో హిందు మతం తప్ప మరే మతం ఉండోద్దని, హిందువులు తప్ప ఇతర మతస్తులు వుండొద్దన్న లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ఆదేశాలను కేంద్రంలో పవర్‌లో ఉన్న కాషాయ పార్టీ అమలు చేస్తున్నది. సనాతన ధర్మంలో ఉన్న స్త్రీ వ్యతిరేక, అభ్యుదయ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, తప్పులను ఎత్తి చూపుతున్న వారిపై మూక దాడులను కేంద్రం దగ్గరుండి ప్రోత్సహిస్తున్నది. రకరకాల రక్షణ సంఘాలంటూ దళితులు, ముస్లింలు, బహుజనులపై దాడులు చేస్తున్నారు. కేంద్రమే కాదు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు మూక దాడులు చేసే వారికి రక్షణ కవచంలా వుంటున్నాయి. అభ్యుదయవాది, పేదల కోసం చివరి వరకూ పోరాటం చేసిన జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ను హిందు మతోన్మాదులు హత్య చేశారు. గౌరి లంకేష్ నుంచి మొదలైన మతోన్మాదుల హత్య రాజకీయాలు, మూక దాడులు రోజు రోజు పెరుగుతూనే ఉన్నాయి.
హిందు మతంలో ఉన్న అనాగరిక అంశాలను ప్రశ్నిస్తున్న వారిపై మూక దాడులు చేస్తూ హత్య చేయడమే మతోన్మాదులు ఎజెండా పెట్టుకున్నారు. కర్నాకటలో గౌరి లంకేశ్ హత్యలో మొదలైన మూక హత్యలు ఇప్పుడు ఏకంగా భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్దాపై దాడి చేసే దాకా వచ్చింది. ఏకంగా కోర్ట్ హాల్‌లోనే కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా సీజేఐపై దాడికి మతోన్మాద అడ్వకేట్ ప్రయత్నించారు. ఏకంగా జస్టిస్ గవాయ్‌పై బూటుతో దాడికి దిగాడు. ఈ దాడి సందర్భంగా సదరు లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కించపర్చితే ఊరుకునేది లేదని కోర్ట్ హాల్‌లో అందరి ముందే సీజేఐని హెచ్చరించారు. దేశ అత్యున్నత ధర్మాసనం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే సుప్రీం కోర్ట్‌లోనే చీఫ్ జస్టిస్‌పై మతోన్మాది దాడికి ప్రయత్నించారంటే ఇక దేశంలో సగటు పౌరుడికి రక్షణ ఎలా ఉంటుంది? జమ్మూ కాశ్మీర్ ఖజురహోలోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలో విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలనే పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు సీజేఐ బీఆర్ గవాయి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. పిటిషనర్‌ను, మీరు విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే, కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి అంటూ ఆ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్ కొట్టేశారు. సీజేఐ వ్యాఖ్యలు ఆ సనాతన ధర్మ కార్యకర్తకు ఇబ్బందికరంగా మారడంతో, ఇవ్వాళ మరో కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్‌పై దాడికి ప్రయత్నించారు.
దేశంలో మతోన్మాదులు ఎంతటి తీవ్రవాదానికి దిగుతున్నారో సీజేఐపై దాడికి ప్రయత్నించిన తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. మతోన్మాదాన్ని,మూక దాడులను, సనాతన ధర్మంలో లోపాలపై ప్రశ్నిస్తున్న వారు ఎంతటి వారైనా దాడులు తప్పవు, హత్యలు చేయడం తథ్యమని తాజా ఘటన స్పష్టం చేస్తున్నది. మతోన్మాదాన్ని అడ్డుకునే వారిపై దాడులు చేస్తామని ఈ చర్య ద్వారా మతోన్మా దులు హెచ్చరించినట్లయింది. దీన్ని సుప్రీంకోర్టు సీజేఐపై దాడిగా మాత్రమే చూడొద్దు. మొత్తం దేశం మీద, న్యాయ వ్యవస్థపై దాడిగా చూడాలి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడిగా చూడాలి. వాస్తవానికి గత కొంత కాలంగా న్యాయ స్థానం ఎంతో కొంత క్రియాశీలకంగా పనిచేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలపై సీరియస్‌గా తీర్పులు ఇస్తోంది. రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తున్నది. మరీ ముఖ్యంగా కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాల నుంచి నిన్నమొన్నటి వక్స్ చట్టం, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై సుప్రీం కోర్ట్ సీరియస్‌గా స్పందించింది.
కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీలను విపక్షాలపై ప్రతీకార చర్యలకు వినియోగించిన నేపథ్యంలో సుప్రీం కోర్ట్ ఆయా విచారణ సంస్థలను హెచ్చరించింది. అంతేకాదు రాజ్యంగ పరిధిలో పని ఏర్పాటైన గవర్నర్, స్పీకర్, రాష్ట్రపతి అధికారాలపై కూడా రాజ్యాంగ పరిరక్ష ధర్మకర్తగా వాటిని పరిశీలిస్తామని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే దేశంలో సుప్రీంకోర్ట్ యాక్టివ్‌గా పని చేయడం, ప్రభుత్వ తప్పులను పశ్నించడంపై దేశాన్ని మత రాజ్యంగా మార్చలనుకుంటున్న మతోన్మాదులు, వారి వెనుక ఉన్న రాజకీయ పార్టీలకు, అనుబంధ సంఘాలకు రుచించడం లేదు. దీంతో మతోన్మాద మూక రెచ్చిపోతున్నది. భౌతిక దాడులకు తెగబడుతోంది.చట్టాలు, న్యాయ స్థానాలపై, రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని మతోన్మాదులు రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతున్నవారిపై దాడులకు దిగుతున్నారు. ఇది భారత దేశానికి అత్యంత ప్రమాదకరం. దేశ ప్రజలు ఇప్పుడు మేల్కోకొక పోతే భవిష్యత్ బానిసత్వమే అవుతుంది.
-తోటకూర రమేష్





