9‌నుంచి పార్లమెంట్‌ ‌రెండోదశ సమావేశాలు

– ఈ సమావేశాల్లోనే స్పీకర్‌ ఓం ‌బిర్లాపై అవిశ్వాసం
– ఎంపీలకు విప్‌ ‌జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ ‌లు

న్యూదిల్లీ, మార్చి 6: కేంద్ర బ్జడెట్‌పై రెండో దశ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ సమావేశాలపుడు సభలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో సమావేశాల్ని వాయిదా వేశారు. రెండో దశ సమావేశాల్లోనే ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. తర్వాత దీనిపై చర్చ, వోటింగ్‌ ఉం‌టాయి. ఈ పక్రియ ప్రారంభమయ్యే వరకు స్పీకర్‌ ‌చైర్‌లో ఓం బిర్లానే ఉంటారు. చర్చ సమయంలో మాత్రం ఆయన సాధారణ ఎంపీలాగే సభలో కూర్చుంటారు. పార్లమెంట్‌ ‌నిబంధనల ప్రకారం ఒక ఎంపీగా తన స్పీకర్‌ ‌పదవిని రక్షిస్తూ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. తాజా సమావేశాలు ఏప్రిల్‌ 2 ‌వరకు జరుగుతాయి. స్పీకర్‌ ఓం‌బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ఆయ‌న‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ గత నెలలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలకు చెందిన 118 మంది ఎంపీలు సంతకాలు చేసి నోటీసులు ఇచ్చారు. దీనిపై ఈనెల 9, 10 తేదీల్లో చర్చ, అనంతరం వోటింగ్‌ ‌జరగనుంది. అందువల్ల ఈ రెండు రోజుల్లో తమ ఎంపీలు అందరూ సభకు హాజరవ్వాలని, అందుబాటులో ఉండాలని బీజేపీ, కాంగ్రెస్‌ ‌లు విప్‌ ‌జారీ చేశాయి. తమ ఎంపీలు సభలో ఉండి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని బీజేపీ సూచించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *