– అత్యధికంగా 67.14శాతం వోటు హక్కు వినియోగం
– వోటేసిన దాదాపు 1.75 కోట్ల మంది మహిళలు
– కృష్ణగంజ్‌లో అత్యధికంగా 76.2 శాతం పోలింగ్
పాట్నా,నవంబర్11: బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని ప్రకటించారు. 20 జిల్లాల పరిధిలోని 122 సీట్లకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ విడతలో 3.7కోట్ల మంది వోటర్లకు గాను.. పోలింగ్ సమయం ముగిసే సమయానికి అత్యధికంగా 67.14శాతం మంది వోటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి విడతలోనూ రికార్డు స్థాయిలో 65.9శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. దాదాపు 1.75 కోట్ల మంది మహిళలు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదు అయింది. కృష్ణగంజ్‌లో అత్యధికంగా 76.2 శాతం పోలింగ్ నమోదు అయింది. కతిహార్‌లో 75.23 శాతం, పూర్ణిమలో 73.79 శాతం, సుపౌల్‌లో 70.69 శాతం, పూర్వీ చంపారణ్‌లో 69.31 శాతం పోలీంగ్ నమోదు అయింది. కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప పోలింగ్ శాతం నమోదు అయింది. నవాడలో 57.11 శాతం, రోహ్తాస్‌లో 60.69 శాతం, మధుబణిలో 61.79 శాతం, అర్వాల్‌లో 63.06 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక, ఎన్నికలు జరిగిన 122 స్థానాల్లో వివిధ ప్రధాన పార్టీల నేతలతో సహా 1,302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2000లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 62.57శాతం నమోదు కాగా.. ఇప్పటివరకు ఇదే గరిష్ఠం. లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే.. 1998లో అత్యధికంగా 64.6శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





