– 3,911 సర్పంచులు, 29,903 వార్డు సభ్యులకు ఎన్నిక
– దాదాపు 28,278 మంది అభ్యర్థులు పోటీ
– ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
– » భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నిక లు ఆదివారం జరగనున్నాయి. వోటు హక్కును విని యోగించుకొనేందుకు పట్టణాల్లో ఉంటున్న ప్రజలు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఏకగ్రీవాలు కాకుండా గ్రామ పంచాయతి రెండో దశలో 3,911 పంచాయతీలకు సర్పంచులు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. తె లంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచా యతీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయం త్రం ముగియడంతో, అధికారులు పోలింగ్కు సన్న ద్ధమయ్యారు. మొత్తం 4,332 గ్రామ పం చాయతీలు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు 14న ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు దాదాపు 28,278 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు కొనసాగనుంది. అనంత
రం 2 గంటల నుంచి కౌంట్ పక్రియ ప్రారం భం కానుంది. ఇదిలా ఉండగా, ఇటీవల ముగి సిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మొత్తం 3,834 సర్పంచ్, 27,600 కు పైగా వార్డులకు జరిగిన తొలి విడత పోలిం గ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అద్భు తమైన సత్తా చాటారు.
తొలి విడతలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఏకం గా 2,872 స్థానాల్లో విజయం సాధించారు. పల్లెపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని ప్రకటించినా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్ద తుదారులు కేవలం 1,160 స్థానాల్లో మా త్రమే గెలుపొందారు. బీజేపీ మద్దతుదారులు దారుణంగా కేవలం 195 స్థానాలకే పరిమిత మయ్యారు. 460 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. తొలి విడత ఎన్నికల సందర్భంగా, కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు, తొలి విడత ఫలితాల జోరుతో రెండో విడత పోలింగ్కు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు సన్నద్ధమయ్యారు. ఇక మూడో విడత ఎన్నికలకు పోలింగ్ ఈనెల 17న జరుగనుంది. వికారాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికలు సాఫీగా జరిగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ప్రతీక్? జైన్ సూచించారు. ఈ నెల 14న 7 మండలాల్లో పోలింగ్ ఉందన్నారు. 13 ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుని, సాయంత్రం పోలింగ్ మెటీరియల్ ను తీసుకొని బూత్లకు వెళ్లిపోయేలా ఆదేవౄలు ఇచ్చారు. గుర్తింపు లేని వ్యక్తులను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





