హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 28: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో 13 జిల్లాల్లో పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల,కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయకు రాకూడదని అధికారులు సూచించారు.వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్ట్ 29, 30 వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల పాఠశాలలు, కళాశాలలు బంద్ కానున్నాయి.సిద్దిపేట జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కాకతీయ పరిధిలో పరీక్షలు వాయిదా
వరంగల్: పలు జిల్లాల్లో ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్ట్ 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాజేందర్ ప్రకటించారు. వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా, కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన బీఎడ్, ఎంఎడ్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టంచేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





