“కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే ఐదు వందల కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి మొత్తం గా 9200 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు విద్యార్థి సంఘాలు కళాశాల యాజమాన్యాలు కలిసికట్టుగా పోరాడితే స్పందించిన ప్రభుత్వం చర్చలు జరిపిన అనంతరం దసరాకు ఆరు వందల కోట్లు సంక్రాంతికి మూడు వందల కోట్ల పైచిలుకు విడుదల చేసింది అయితే అవి ఎంత మాత్రం సరిపోవు మొత్తం బకాయిలతో పోలిస్తే చాలా తక్కువ.”
ఏప్రిల్ 2న తెలంగాణ హైకోర్టు డబ్ల్యు.పి 5341,4910/2026 లో విద్యార్థుల నుండి ప్రైవేటు కాలేజీలు టూషన్ ఫీజును వసూలు చేసుకోవచ్చునని ప్రభుత్వం ఇస్తే తిరిగి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చింది.
స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ నేపథ్యం
విద్యార్థులకు అనుగుణంగా ప్రభుత్వ విద్యాసంస్థలను నెలకొల్ప లేని ప్రభుత్వం ప్రవేట్ కాలేజీల్లో చదువుకోమని చెప్పి అవకాశాన్ని ప్రోత్సహించింది 2008 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏంఎస్ నెంబర్ 50, 2009లో జీవో ఎంఎస్ నెంబర్ 102, 2010లో జీవో ఎంఎస్ నెంబర్ 60 ప్రకారం పేద విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వారు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకుంటే స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు ఇస్తామంటూ ప్రకటించింది దీంతో పుట్టగొడుగుల్లా వందల కొద్ది ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మార్కెట్లోకి నెలకొల్పబడ్డాయి ఇవన్నీ కూడా విద్యార్థుల ఫీజు రియబర్స్మెంట్ స్కీం పైన ఆధారపడే నడుస్తున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకుండా విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహించింది. దీంతో విద్యార్థులకు తమ కోర్సు అయిపోయిన అటు ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థులను ట్యూషన్ ఫీజు కట్టమని తీవ్రమైన ఒత్తిడికి గురిచేసాయి సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఫీజులు కట్టలేని విద్యార్థులు కొందరు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు.
డబ్ల్యు.పి 5341,4910/2026 ప్రభుత్వ జీవోలు తమను విద్యార్థుల నుండి ఫీజు వసూలు నిషేధించాయనీ ఫీజు బకాయిలతో విద్యాసంస్థలను నడపలేకపోతున్నామని ప్రభుత్వంపై ఆర్టికల్ 226 ప్రకారం మండముస్ రిట్ గాని జీవోల నిషేధాన్ని ఆపివేసి విద్యార్థులనుండే ఫీజులను వసూలు చేసుకుంటామని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్.ఈ విషయంపై ఎన్నోసార్లు ప్రభుత్వ ప్రత్యేక అడ్వకేటుకు అవకాశం ఇచ్చినప్పటికీ ఎలాంటి కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేయలేదు. ప్రభుత్వ అడ్వకేట్ రిక్వెస్ట్ తో ఏప్రిల్ 30న కౌంటర్ వేయమని సూచించింది కోర్టు. “2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుండే ఫీజులను వసూలు చేసుకోమనీ…. ప్రభుత్వం ఇస్తే తిరిగి ఇవ్వమని మధ్యంతర ఆర్డర్ ఇచ్చింది.” కౌంటర్ ను ఇంతవరకు దాఖలు చేయకపోవడాన్ని ప్రభుత్వం వైఖరిని తెలుపుతున్నాయి.
మండమస్ రిట్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు తమ పరిధిలోని ప్రభుత్వాన్ని ప్రభుత్వాధికారులను శాఖలకు స్టాట్యూటరీ విభాగాలకు తమ చట్టపరమైన పనిని చేయడంలో విఫలమైనప్పుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వారి పని పెద్ద మొత్తంలో ప్రజలకు నష్టం చేకూరుతుంది కాబట్టి రూల్ ఆఫ్ లా కాపాడడానికి తమ చట్టపరమైన పనిని చేయమని ఇచ్చేదే మాండమస్ రిట్ (వి కమాండ్).
ఇక్కడ ప్రభుత్వం తన చట్టపరమైన పనిని చేయడంలో సమయం ప్రకారం ట్యూషన్ ఫీజును విడుదల చేయడంలో విఫలమైంది విద్యార్థులు విద్యార్థి సంఘాలు విద్యాసంస్థలు తమ న్యాయమైన ట్యూషన్ ఫీజును స్కాలర్షిప్లను విడుదల చేయమని అర్జీలు వినతులు పెట్టుకున్నప్పటికీ మొండివైఖరి ప్రదర్శించింది దీంతోపాటు ప్రభుత్వ ప్రత్యేక అడ్వకేట్ ప్రభుత్వ నిర్ణయం పెండింగ్ బకాయిల విడుదల చేసే పద్ధతిని పైగాని స్పందించక పోగా కౌంటర్ వెయ్యలేదు ఇది దాదాపుగా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ పై చదువుకుంటున్న 14 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులను అప్పుల పాలు చేస్తుంది. హైకోర్టు తన న్యాయ విచక్షణ జ్ఞానంతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సజావుగా ఫీజు బకాయిలు అందాలంటే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే ఐదు వందల కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి మొత్తం గా 9200 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు విద్యార్థి సంఘాలు కళాశాల యాజమాన్యాలు కలిసికట్టుగా పోరాడితే స్పందించిన ప్రభుత్వం చర్చలు జరిపిన అనంతరం దసరాకు ఆరు వందల కోట్లు సంక్రాంతికి మూడు వందల కోట్ల పైచిలుకు విడుదల చేసింది అయితే అవి ఎంత మాత్రం సరిపోవు మొత్తం బకాయిలతో పోలిస్తే చాలా తక్కువ.
ప్రైవేటు విద్యాసంస్థలు ముందుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరిపి వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం నుండి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు ప్రత్యేకమైన కార్పస్ నిధిని ఏర్పాటు చేసి ప్రతి విద్యా సంవత్సరం మొదట్లో కొంత మధ్యలో కొంత విద్యా సంవత్సరం ముగిసే లోపు మొత్తంగా ఇచ్చే చట్టపరమైన పద్ధతిని అమలు చేస్తే తప్ప ఈ ఊబి నుంచి బయటపడలేరు.
స్టాలిన్
న్యాయ శాస్త్ర విద్యార్థి
కాకతీయ విశ్వవిద్యాలయం
ఎస్.ఎఫ్.ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షులు
7416420830




