– కనీసం కేబినెట్లో చర్చించకుండానే పేరు మార్పుపై నిర్ణయం
– ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర
– దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భారీ పోరాటం
– మహాత్మా గాంధీ’ పేరు తొలగింపుపై ఆగ్రహం
– పేదల పొట్ట కొట్టేందుకే ‘వికసిత్ భారత్ గ్యారెంటీ’
– జనవరి నుండి ‘సేవ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ’ ఉద్యమం : రాహుల్
న్యూ దిల్లీ, డిసెంబర్ 27 : ఉపాధి హామీ పథకం పేరు మార్పు మరియు దాని రూపురే ఖలను మారుస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘విక సిత్ భారత్ గ్యారెంటీ’ బిల్లుపై లోక్సభ ప్రతిప క్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. యుపిఏ హయాంలో కోట్లాదిమంది పేదలకు అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి గాంధీజీ పేరును తొలగించడం జాతిపితను అవమానించడమేనని రాహుల్ అన్నారు. ఈ కీలక నిర్ణ యాన్ని కనీసం కేబినెట్లో చర్చించ కుండా, సంబంధిత శాఖా మంత్రులతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక ఒకే వ్యక్తి నిర్ణయాలు అమలు చేసే రాచరిక వ్యవస్థా అని రాహుల్ ధ్వజమెత్తారు.
పేదల హక్కులపై దాడి
ప్రధాని మోదీకి గాంధేయ సిద్ధాంతాలన్నా, పేదల హక్కులన్నా తీవ్ర వ్యతిరేకత ఉందని రాహుల్ ఆరోపించారు. కరోనా వంటి సంక్షోభ సమయాల్లో గ్రామీణ కుటుంబాలను ఆకలి నుండి కాపాడిన ఈ పథకాన్ని ఇప్పుడు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కొత్త బిల్లు ప్రకారం నిధుల కేటాయింపులో కేంద్రం కోతలు పెట్టి రాష్ట్రాలపై 40 శాతం ఆర్థిక భారాన్ని మోపుతోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
జనవరి నుండి ‘సేవ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ’ ఉద్యమం
ఉపాధి హామీ పథకం అనేది కేవలం ఒక స్కీ మ్ కాదని, అది గ్రామీణ పేదల ‘పని హక్కు’ అని రాహుల్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన మార్పుల వల్ల భవిష్యత్తులో నిధులు లేక పేదలకు పని దొరకని పరిస్థితి ఏర్పడు తుందని ఆందో ళన వ్యక్తం చేశారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి నిరసనగా దేశవ్యాప్తంగా పో రాడాలని సిడబ్ల్యూసీలో నిర్ణయించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్. నుండి వీధుల వరకు ఈ పోరా టాన్ని ఉధృ తం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.




