రేపు పొన్నం సత్తయ్య గౌడ్‌ పురస్కార ప్రదానోత్సవం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర సెప్టెంబర్‌ 12: రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్‌ స్మారకార్థం ఏర్పాటు చేసిన పొన్నం సత్తయ్య గౌడ్‌ జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవ సభ హైదరాబాదులోని రవీంద్ర భారతిలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నట్లు అవార్డుల జ్యూరీ సభ్యుడు పొన్నం రవిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. 2025 సంవత్సరానికి గాను సాహిత్య రంగంలో ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్‌కు, కళా రంగంలో కరీంనగర్‌కు చెందిన అంతడుపుల రమాదేవికి ఈ పురస్కారాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, విశిష్ట అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్‌ వెంకటస్వామి హాజరవుతారని వివరించారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని కవులు, కళాకారులు, రచయితలు హాజరు కావాలని రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *