యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: యాదగిరిగుట్ట మండల పర్యటనలో భాగంగా నూతనంగా ఎన్నికైన మర్రిగూడెం సర్పంచ్ స్వప్నను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందించారు. విద్యావంతురాలు సర్పంచ్‌గా చిన్న వయసులో గెలవడం సంతోషమని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు అదేవిధంగా చిన్న కందుకూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ కాటం శ్రీకాంత్ వార్డు సభ్యుడిని అభినందించారు. సీపీఐ మండల కార్యదర్శి కలిపెల్లి మహేందర్ మాతృమూర్తి ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఎండీ ఇమ్రాన్, జిల్లా సమితి సభ్యుడు శ్రీధర్, మున్సిపల్ కో ఆప్షన్ మాజీ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి పేరబోయిన బంగారు రాయగిరి, బాలకృష్ణ, బోధ స్వామి, సుబ్బురి నర్సయ్య, నమిల సంజీవ తదితరులు పాల్గొన్నారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





