బోటి తండాలో విషాదం

– అనారోగ్యంతో సర్పంచ్ కన్నుమూత

ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి21: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని బోటితండా గ్రామ సర్పంచ్ భూక్య తులసీరామ్(45) కన్నుమూశారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ బోటితండా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తులసీరామ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే తులసీరామ్ పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో అక్కడి వైద్యుల సలహాతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు తరలించారు. హైదరాబాద్లోని హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ తులసీరామ్ కన్నుమూశారు. తులసీరామ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సర్పంచ్ తులసీరామ్ మృతితో బోటితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. తులసీరామ్ మృతి పట్ల మండలంలోని ఇతర సర్పంచ్ లు, వివిధ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *