గ్రామీణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్న స్టాల్స్‌

మార్కెటింగ్‌ ఇన్నోవేషన్‌కు అద్దంపడుతున్నాయి
– మంత్రి సీతక్కకు ప్రశంసలు
– సరస్‌ మేళా సందర్శించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29: మహిళా స్వయం సహాయక బృందాలు నిర్వహిస్తున్న స్టాళ్లు చాలా బాగున్నాయని, గ్రామీణ ప్రాంతాల స్ఫూర్తి, మార్కెటింగ్‌ ఇన్నోవేషన్‌కు సరస్‌ ఫెయిర్‌ అద్దం పడుతోందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్క సంతోషం వ్యక్తం చేశారు. శిల్పారామం పక్కన గల ఇందిరా మహిళా శక్తిబజార్‌లో నిర్వహిస్తున్న సరస్‌ మేళాకు గవర్నర్‌ విచ్చేసిన సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు ఘన స్వాగతం పలికారు. మంత్రి సీతక్క శాలువాతో ఆయనను సత్కరించగా ఒగ్గు డోలు కళాకారులు తమ డోలు చప్పుళ్లతో స్వాగతం పలికారు.. 20కి పైగా రాష్ట్రాల నుంచి వచ్చిన 150కి పైగా స్టాల్స్‌ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయని, తెలంగాణలోని నకాషీ బొమ్మల నుంచి ఒడిస్సా పట చిత్రాల వరకు అన్నీ ఇక్కడ లభిస్తున్నాయంటూ సరస్‌ ఫెయిర్‌ను చక్కగా నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఈశాన్య రాష్ట్రాల స్టాళ్లు చాలా బాగున్నాయి ఇందిరా మహిళా శక్తి నిదానం ద్వారా 65 లక్షల మంది మహిళలు సంఘటితమవుతున్నారుమహిళా స్వయం సహాయక బృందాల ఉద్యమం తెలంగాణలో సాగుతుంది ఉద్యమంలా మహిళా సాధికారత ముందుకు సాగటం సంతోషంగా ఉంది నేను గతంలో పోచంపల్లి ని సందర్శించానుఅక్కడ లభించేవి కేవలం చీరలు దుస్తులే కాదు.. అక్కడ లభించేది తెలంగాణ చరిత్ర సంస్కృతి అని అన్నారు. ఈశాన్య రాష్ట్ర దుకాణాల సముదాయాన్ని సందర్శించి అక్కడి మహిళా బృందాల వ్యాపార అనుభవాలను, ఆ బృందాలు తయారు చేసిన సాంప్రదాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాల గురించి గవర్నర్‌ అడిగి తెలుసుకుని స్టాల్స్‌ నిర్వాహకులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ స్టాల్స్‌లో వెదురు బెడ్‌ లాంప్‌ స్టాండ్‌ను కొనుగోలు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో ఉమెన్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, సెర్ప్‌ సీఈవో దివ్యా దేవరాజన్‌, తదితరులు పాల్గొన్నారు.

మహిళా సాధికారతకు చిరునామా సీతక్క: గవర్నర్‌ ప్రశంస

మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ ఇందిరా మహిళా శక్తి పాలసీనీ గవర్నరుకు సీతక్క వివరించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్కపై గవర్నర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో ఎస్టి కమ్యూనిటీ నుంచి సిన్సియర్‌ మంత్రి సీతక్క ఉన్నారు .. ప్రత్యేకంగా ఎస్టీలు, అణగారిన వర్గాలు, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం సీతక్క నిరంతరం పరితపిస్తారు.. మహిళా సాధికారత కు సీతక్క చిరునామాగా ఉన్నారు.. సీతక్క చాలా సిన్సియర్‌, చాలా హార్డ్‌ వర్కర్‌ అని సీతక్క గురించి నేను ఎక్కడికి వెళ్లినా చెప్తూ ఉంటాను.. మన ట్రైబల్‌ బిడ్డ తెలంగాణలో మహిళా సాధికారత కోసం విశేషంగా కృషి చేస్తున్నారని సొంత రాష్ట్రం త్రిపురలో కూడా నేను ఎంతోమందికి చెప్పాను.. అక్కడ సీతక్క పేరు చాలామందికి తెలుసు ..ఆమెను చూసేందుకు, ఆమె మాటలు వినేందుకు త్రిపుర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ ప్రజల తరఫున నేను సీతక్కను త్రిపురకు ఆహ్వానిస్తున్నాను.. తప్పకుండా త్రిపురకు రావాలిఅని గవర్నర్‌ ఆమెకు సాదర స్వాగతం పలకడం హైలైట్‌.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *