-హైదరాబాద్ రామకృష్ణ మఠ్ ప్రతినిధి తత్పదానందజీ
హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః శారదాదేవి రామకృష్ణుడి భార్యగా లోకానికి సుపరిచితురాలైనా జీవితకాలం బ్రహ్మచారిణిగానే గడిపారని హైదరాబాద్ రామకృష్ణ మఠ్ స్వామి తత్పదానందజీ తెలిపారు. ఆమె బోధనలు రామకృష్ణ పరమహంస జీవితంతో మమేకమై ఆమెను పవిత్రమాతగా భక్తులు ఆరాధిస్తున్నారన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి, హనుమకొండ ఆధ్వర్యంలో దివ్యజనని శారదా దేవి 173వ జయంతిని సమితి అధ్యక్షుడు కటంగూరు సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. తత్పదానందజీ జ్యోతి ప్రజ్వలన, హారతితో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కగా ఉన్నప్పుడే కంచె అవసరం అని, అది పెరిగి పెద్దయ్యాక పశువులు దాన్ని మేయలేవని, అట్లే బాల్యంలోనే ధ్యానాన్ని అభ్యసించి స్థిర చిత్తం ఏర్పడ్డాక ఆ వ్యక్తి ఎక్కడున్నా, ఎవరితో కలిసిమెలిసి తిరిగినా అతని మనస్సులో ఎలాంటి మార్పు ఉండదని విద్యార్థినులనుద్దేశించి తెలంగాణ వివేకానంద భావ ప్రచార కమిటీ ప్రతినిధి సూర్యప్రకాశ్ అన్నారు. ప్రతి కుటుంబానికి, బిడ్డగా, తల్లిగా, భార్యగా బాలికలు మూల స్తంభాలంటూ వారి బాధ్యతలను పంచ దశ అజెండాగా గుణగణాల మంచిచెడులను అవంతి హై స్కూల్ ప్రిన్సిపాల్ గీతారాణి విశ్లేషించారు. హనుమకొండ ఫ్లాట్ అసోసియేషన్ ప్రతినిధులు రెంటాల కేశవ రెడ్డి, తిరువరంగం ప్రభాకర్, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి, ధర్మకర్తలు ఎన్ఆర్ఐ తోట నరేందర్, చెంచారపు మధుసూదన్ రెడ్డి, చిదర రుద్రయ్య, రవిచందర్, కెవి రావు, అరుణ్ నాయక్, (డఫొడిల్, ఆక్స్ఫర్డ్, అవంతి, విశ్వశాంతి) ఉన్నత పాఠశాలల విద్యార్థినులు, టీచర్లు, సేవా సమితి ప్రతినిధులు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్య, శారదా మాతృమండలి టీమ్ సభ్యులు మూల లక్ష్మమ్మ, గోరంటల స్వరూప, చిదర అంజనీ దేవి, స్రవంతి, శిల్ప, వీణ, ధనలక్ష్మి, యువ విభాగ్ కన్వీనర్ సుమన్, విష్ణు, మహేశ్, రవళి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





