సిట్‌ ‌విచారణకు హాజరైన సంతోష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి27:  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్‌ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్‌ ‌సోమవారం ఆయనకు నోటీసులు ఇచ్చింది. దాంతో ఇవాళ సంతోష్‌రావు సిట్‌ అధికారుల ఎదుట విచారణకు వచ్చారు. సోమవారం సిట్‌ ‌నోటీసులు అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రేపు సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతానని, కేసు సంబంధించి వారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని అన్నారు. కాగా ఇదే కేసులో గతంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను కూడా సిట్‌ ‌విచారించింది. వారి వాంగ్మూలాలను నమోదు చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *