15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

– అందరూ పాల్గొనాలని మంత్రి అడ్లూరి ఆహ్వానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవం ఈనెల 15వ తేదీ ఉదయం జరగనుంది. ఈ ఉత్సవాలలో ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి చెందిన అందరు గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని గిరిజన సంక్షేమ శాU మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లంబాడీ గిరిజన సంప్రదాయ పద్ధతి ప్రకారం సంత్ సేవాలాల్ ఆరాధన కార్యక్రమాలు, గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 నాటి సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటివరకు వేడుకలకు ఖర్చు పెడుతున్న రూ.కోటిని రెట్టింపు చేయడమేకాÅ£ ఉత్సవాలు జరుపుకోవడానికి వీలుగా బంజారా ఉద్యోగులకు 15న ప్రత్యేక సెలవు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో జరగ·నున్న సేవాలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసిందన్నారు. గిరిజన ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అందరికీ ఆహ్వానం పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *