కిట్స్‌లో రేపు ‘సంస్కృతి-26’ కార్నివాల్

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 5: విద్యార్థి లోకంలో ఒత్తిడిని నివారించి ఆనందాన్ని నింపేందుకు సంస్కృతి -26 పేరుతో జాతీయస్థాయి సాంస్కృతిక కార్నివాల్‌ను కిట్స్(డబ్ల్యు) నిర్వహిస్తున్నది. ఈ కార్నివాల్ కిట్స్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండిఎఫ్) క్లబ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) ఈనెల 6, 7 తేదీలలో నిర్వహిస్తోంది అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి సంగీత దర్శకుడు, గాయకుడు, తెలంగాణకు చెందిన ప్రశాంత్ ఆర్ విహారి విచ్చేయ‌నున్నారు. గౌరవ అతిథిగా ప్రఖ్యాత జానపద గాయకుడు, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ పాల్గొంటారని ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎంపీ, కిట్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థినీవిద్యార్థులను అభినందించి కిట్స్ కోశాధికారి పి.నారాయణరెడ్డి, అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక రెడ్డి మాట్లాడుతూ ఈ సాంస్కృతిక ఉత్స‌వ నిర్వ‌హ‌ణ‌ ప్రాథమిక లక్ష్యం విద్యార్థులకు వినోదం, ఆనందాన్ని అందించడంతోపాటు, విద్యార్థి సమాజంలో నాయకత్వం, నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడమేనని అన్నారు  రెండు రోజుల ‘సంస్కృతి’లో మొదటి రోజు పాశ్చాత్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రారంభోత్సవం తరువాత పోటీలు ఉంటాయి. రెండవ రోజు ప్రముఖ గాయకులు, కళాకారులు పాల్గొనే సాంప్రదాయ బీట్స్, లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు ఉంటాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *