– హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చర్యలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్17:భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో గచ్చిబౌలిలో సోమవారం భారీ కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్‌సీఐ లే అవుట్‌లో అక్రమంగా నిర్మించిన సంధ్యా కన్వెన్షన్ భవనాలను నేలమట్టం చేశారు. హైడ్రాలిక్ జాక్ క్రషర్‌తో నిర్మాణాలను కూల్చివేశారు. తమ ప్లాట్లను ఆక్రమించి సంధ్యా శ్రీధర్ రావు రోడ్లు వేశారని తెలంగాణ హైకోర్టును బాధితులు ఆశ్రయించారు . ఈ క్రమంలో సంధ్యా శ్రీధర్ రావు అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. న్యాయస్థానం ఆదేశాలతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు దూకుడుతో ముందుకెళ్తున్నారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదులు వస్తే శరవేగంగా చర్యలు చేపడుతున్నారు. హైడ్రా అధికారులు తమకు అండగా నిలవడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





