మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థాలు

– ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య
– అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డ్రగ్స్‌ ఫ్రీ జోన్‌ : వీసీ ప్రొ. చక్రపాణి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండడమే అన్ని విధాల శ్రేష్ఠమని అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో మాదక ద్రవ్యాల వినియోగం- నివారణ అనే అంశంపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన వక్తగా సందీప్‌ శాండిల్య మాదక ద్రవ్యాల వినియోగం- నివారణ అనే అంశంపై విద్యార్ధులకు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఒక్కసారి వాటికి అలవాటుపడితే అదో వ్యసనంగా మారి బానిసలుగా తయారవుతారని, అది అటు తల్లిదండ్రులకు, ఇటు సమాజానికి చెడ్డపేరు తెస్తుందని చెబుతూ ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఉదహరించారు. తెలంగాణ సమాజం నుంచి డ్రగ్స్‌ను పారద్రోలడం సమష్టి బాధ్యతగా యువత, బాధ్యత గల పౌరులు భావించాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల వ్యక్తి తన సహజ లక్షణాలను కోల్పోయి నిత్యం మత్తుపదార్దాల కోసమే పరితపిస్తారని, అంతేకాక తద్వారా తమ జీవితం కూడా బుగ్గిపాలవుతుందని ఆయన హెచ్చరించారు. ముఖ్య అతిథి, విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొ.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ యువత తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, వ్యసనాలకు అలవాటుపడొద్దని హితవు పలికారు. యూనివర్సిటీ డ్రగ్స్‌ ఫ్రీ జోన్‌ అని ప్రకటించారు. రానున్న రోజుల్లో తమ యూనివర్సిటీ విద్యార్ధులకు డ్రగ్స్‌ వాడకం వల్ల కలిగే నష్టాలపై పూర్తి అవగాహన కల్పించి వారి సహాయంతో మాదక ద్రవ్యాల నివారణకు అవసరమైన ప్రచారాన్ని చేపడతామని ప్రకటించారు. అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ అకడమిక్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జి.పుష్పాచక్రపాణి మాట్లాడుతూ సామాజిక భాద్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, రానున్న రోజుల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ార్యక్రమాన్ని కంప్యూటర్‌ సైన్సు విభాగం ఆధ్య్వర్యంలో నిర్వహించగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎల్‌.విజయ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భట్టు, అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *