- మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలి
– సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు
– రెడీగా సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ మిషన్లు
– గుండె ఆపరేషన్ల కోసం క్యాథల్యాబ్
– అవయవమార్పిడి కోసం ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్
– ఏర్పాట్లపై మంత్రి దామోదర్ సమీక్ష
హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్
సనత్‌నగర్ టిమ్స్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌గా తీర్చిదిద్దాలని గతంలోనే అధికారులకు మంత్రి సూచించారు. ఇందుకనుగుణంగా అన్నిరకాల గుండె సంబంధిత ఆపరేషన్లు చేసేలా, అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించేలా క్యాథల్యాబ్స్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ థియేటర్ల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. క్యాథల్యాబ్ ఏర్పాటు పనులు చివరి దశలో ఉన్నాయని, ఓటీలు ట్రయల్ రన్‌కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. నగరంలోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్‌పై పెరుగుతున్న రోగుల ఒత్తిడిని తగ్గించేందుకు టిమ్స్ సనత్‌నగర్ ప్రధాన భూమిక పోషిస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఆయా హాస్పిటళ్లలో శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న రోగులను ఇక్కడికి రిఫర్ చేసి, త్వరితగతిన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. దీనికి సంబంధించి ఆయా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. హాస్పిటల్ నిర్వహణకు అవసరమైన ప్రొఫెసర్లు, డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది నియామక పక్రియపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు. పూర్తిగా కొత్త హాస్పిటల్ అయినందున డీఎంఈ, నిమ్స్ పరిధిలోని సీనియర్ డాక్టర్ల సేవలను సనత్‌నగర్ టిమ్స్‌లో వినియోగించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. పారిశుధ్యం, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో ఇప్పటికే నగరంలోని పలు కార్పొరేట్ హాస్పిటల్స్, నిమ్స్, ఎయిమ్స్‌లో అనుసరిస్తున్న పద్ధతులను డీఎంఈ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందజేసింది. ఆయా హాస్పిటల్స్ బెస్ట్ ప్రాక్టీస్ విధానాలనే టిమ్స్‌లోనూ అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. మెడికల్ సర్వీసెస్‌తో పాటు సానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. రోగులకు ఓపీ రిజిస్టేష్రన్ నుంచి డిశ్చార్జి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ-హెచ్‌ఎంఐఎస్ సాప్ట్‌వేర్ ద్వారా సేవలను అనుసంధానించాలని మంత్రి సూచించారు. రోగులకు, వారి సహాయకులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చి 15 నాటికి పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న పనులన్నీ పూర్తి చేసి ఉగాది నాటికి హాస్పిటల్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




