– ఆర్‌అండ్‌బీ అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుండే ప్రజలకు వైద్య సేవలందించే విధంగా అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ అన్నీ ముందే సమకూర్చుకోవాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని నియమించుకోవాలని డీఎంఈ నరేంద్ర కుమార్‌ను ఆదేశించారు. సనత్‌నగర్, ఎల్బీనగర్, కొత్తపేట టిమ్స్ హాస్పిటళ్లు, నిమ్స్ హాస్పిటల్ విస్తరణ ప్రాజెక్టు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌లో ఆర్ అండ్ బీ, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శుక్రవారం సమీక్ష్షా సమావేశం నిర్వహించారు. సనత్‌నగర్ టివమ్స్ పనులు చివరి దశలో ఉన్నాయని, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌ల పనులు మరో ఆరు నెలల్లో పూర్తి అవుతాయని అధికారులు మంత్రికి వివరించారు. సనత్‌నగర్ టిమ్స్‌ను ఈ ఏడాది చివరిలో ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించిన విషయాన్ని అధికారులకు మంత్రి గుర్తు చేశారు. అక్టోబర్ చివరికల్లా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావొద్దని అన్నారు. ఫర్నిచర్ కొనుగోలు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, డయాగ్నస్టిక్ యంత్రాలు అన్నీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడినవే కొనుగోలు చేయాలని సూచించారు. సంబంధిత శాఖ డాక్టర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నిమ్స్ విస్తరణ ప్రాజెక్టు పనులపై మంత్రి ఆరా తీశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌కు హాస్టల్ సదుపాయం కూడా అక్కడే ఉండాలని ఆదేశించారు మహబూబాబాద్, మంచిర్యాల, జనగాం, వనపర్తి మెడికల్ కాలేజీ భవనాలను మరో రెండు నెలల్లో అప్పగిస్తామని, . మరో ఎనిమిది నెలల్లో మిగిలిన కాలేజీల పనులను పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, ఆర్‌అండ్‌బీ సీఈలు రాజేశ్వర్‌రెడ్డి, లింగారెడ్డి, ఇతర అధికారులు, కాంట్రాక్ట్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





