ఉగాదినాటికి సనత్‌నగర్‌ టిమ్స్‌ ప్రారంభం

– గుండె సంబంధ చికిత్సకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌
– ఇక్క‌డే అత్యాధునిక ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సెంటర్‌
– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13: సనత్‌నగర్‌ టిమ్స్‌ హాస్పిటల్‌ను ఉగాది నాటికి ప్రారంభిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ వెల్లడిరచారు. హాస్పిటల్‌ భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, విద్యుత్‌ పనులు కొన్ని ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. ఆపరేషన్‌ థియేటర్లు, డయాగ్నస్టిక్స్‌, ఇతర పరికరాల ఏర్పాటు కూడా చివరి దశలో ఉన్నాయన్నారు. టిమ్స్‌ భవనాన్ని, అందులో జరుగుతున్న పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌ఐ వంటి భారీ యంత్రాల ఫిట్టింగ్‌ పూర్తయిందన్నారు. తమది ప్రచార ఆర్భాటం ఉండదని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే తమ ఆరాటం అని పేర్కొన్నారు. పూర్తిస్థాయి సౌకర్యాలతో ఉగాది నాటికి పేషెంట్లకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తామని, వెయ్యి పడకల ఈ హాస్పిటల్‌లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా సనత్‌నగర్‌ టిమ్స్‌ ఉంటుందన్నారు. ఇక్కడే అవసరమైన పరిశోధన కూడా జరుగుతుందన్నారు. అత్యాధునిక ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని రకాల అవయవ మార్పిడి సర్జరీలు చేసేలా అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఆరోగ్య శాఖలో గత రెండేళ్లలోనే సుమారు పది వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇంకో ఏడు వేలకుపైగా ఉద్యోగాల భర్తీ చివరి దశలో ఉన్నాయని, మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందికి ఎలాంటి కొరత ఉండదని మంత్రి దామోదర్‌ చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *