శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు
భాగ్యనగరంలో ముగిసిన చాతుర్మాస్య దీక్ష
స్వామీజీకి వీడ్కోలు పలికిన భక్తులు
సమాజం వక్రమార్గంలో వెళ్లడానికి.. యువత చెడు మార్గంలో పయనించడానికి సమున్నతమైన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించక పోవడమేనని శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదులు అన్నారు. ప్రతి ఒక్కరిలో ఈర్ష్య ..చెడు ఆలోచనలు కలగడానికి కారణం మన అలవాట్లేనని అన్నారు. మన వేదాలు పురాణాలు ఉపనిషత్తుల ద్వారా పుట్టిందే సనాతన హిందూ ధర్మమని ఇది విశ్వ మానవాళికి మార్గదర్శకం చేస్తుందని శ్రీ సత్యాత్మ తీర్థ సత్యాత్మ తీర్థ చెప్పారు. ప్రతి ఒక్కరిలో పరోపకారం ఉండాలని ప్రతి మనిషి సోదర భావం తో మెలగాలని అప్పుడే సమాజంలో శాంతి తో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతమైన పరమాణువులతో అద్భుతమైన మానవాళిని ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆ భగవంతుడిని ప్రతిరోజు మనస్ఫూర్తిగా భక్తితో ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని స్వామీజీ పిలుపునిచ్చారు. 50 రోజులపాటు భాగ్యనగరంలో చాతుర్మాస్య దీక్ష ముగించిన స్వామీజీ భక్తులనుద్దేశించి ప్రసంగించారు. గత 50 రోజులుగా భాగ్యనగర వాసులు లక్షలాదిమంది ఎంతో ప్రేమానురాగాలు చూపించారని వారిని వదిలి వెళ్లడం బాధగా ఉందని స్వామిజీ అన్నారు. చాతుర్మాస దీక్ష సందర్భంగా దేశం నలుమూలల నుంచి వొచ్చిన సుమారు ఐదు లక్షల మందికి పైగా భక్తులు స్వామీజీని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. వీరందరికీ ప్రతిరోజు 50 రోజులుగా భోజన వసతి తో పాటు అనేక ఏర్పాట్లు చేశారు. చాతుర్మాస్య దీక్ష సందర్భంగా వేలాదిమందికి ఉచిత కంటి ఆపరేషన్లు .. వైద్య పరీక్షలు నిర్వహించారు ఉద్యోగ ప్రమోద ద్వారా సుమారు వందమందికి పైగా నిరుద్యోగులకు ఐటి ఉద్యోగాలు కలిగించారు . కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, జి కిషన్ రెడ్డి లతోపాటు పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పుర ప్రముఖులు స్వామీజీని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. 50 రోజులపాటు హైదరాబాదులో స్వామీజీ చాతుర్మాస్యాదీక్ష ఘనంగా ముగిసిన సందర్భంగా భక్తులు కన్నీళ్ళతో స్వామీజీకి వీడ్కోలు పలికారు.. ఆదివారము ఉదయం స్వామీజీ శాతూరు మాస్యా దీక్ష ముగించుకొని విజయవాడ బయలుదేరి వెళ్లారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గవర్నర్లు ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయతో కలిసి వినాయక ఉత్సవాల్లో స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు