సమ్మక్కసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు ఛత్తీస్‌గడ్‌ ‌సుముఖత

– ముంపు భూమికి పరిహారం చెల్లింపునకు మంత్రి ఉత్తమ్‌ అం‌గీకారం

రాయ్‌పూర్‌,‌సెప్టెంబర్‌ 22: ‌తెలంగాణ రాష్ట్రంలోని సమ్మక్కసాగర్‌ ‌ప్రాజెక్ట్‌కు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రభుత్వం ముందుకు వొచ్చింది. రాయ్‌పూర్‌లో సీఎం విష్ణు దేవ్‌ ‌సాయిని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌కలిశారు. నీట మునిగే భూభాగం పరిహారం భరించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది. ములుగు జిల్లాలో 6.7 టీఎంసీ సామర్థంతో ఈ సమ్మక్క సాగర్‌ ‌డ్యామ్‌ ‌నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల నల్గొండ, వరంగల్‌లో తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించనుంది. రామప్ప-పాఖాల లింక్‌ ‌కెనాల్‌ ‌కింద కొత్తగా 12,146 ఎకరాలకు నీరు అందుతుంది. వరంగల్‌, ‌సూర్యాపేట, మహబూబాబాద్‌, ‌జనగాం, ఖమ్మం జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. నల్గొండ, వరంగల్‌లో తాగునీటి సమస్యలకు సమ్మక్కసాగర్‌ ‌పరిష్కారం దక్కుతుంది. 90 కిలోటర్ల టన్నెల్‌ ‌నెట్‌వర్క్‌తో భారీ ఇంజనీరింగ్‌ ‌డిజైన్‌ ‌కింద మూడు పంప్‌హౌసులు, క్రాస్‌ ‌డ్రెయినేజ్‌ ‌వర్కస్ ‌ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించ నున్నారు.  ఛత్తీస్‌గఢ్‌లో 73 హెక్టార్ల భూభాగం నీట మునిగే అవకాశం ఉంది. పరిహారం, పునరావాసం భరించేందుకు తెలంగాణ సిద్ధం అని ఛత్తీస్‌ఘడ్‌ ‌సిఎంకు మంత్రి ఉత్తమ్‌ ‌హా ఇచ్చారు. ఐఐటీ- ఖరగ్‌పూర్‌ ‌సబ్‌మెర్జెన్స్ ‌స్టడీ ఫైండింగ్స్ అమలు చేస్తామని  ఉత్తమ్‌ ‌తెలిపారు. ఎన్‌ఓసీ జారీకి ముందే అడ్వాన్స్ ‌చెల్లింపులు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *