– మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థి నవీన్ మాదవ్‌కు విజయం కోసం కష్టపడ్డ ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. విజేత నవీన్ యాదవ్ కు అభినందనలు తెలిపారు. ఇది చరిత్రాత్మక విజయం. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని, అనంతమైన అబద్దాలకు ప్రజలు చెప్పిన గుణపాఠం ఇది అని అన్నారు. ఇది రెండేళ్ల ప్రజా పాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనను లభించిన ఆమోద అంటూ. ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు కట్టిన పట్టం ఈ విజయం. కాంగ్రెస్ పాలనకు తిరుగు లేదని నిరూపించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి రెండేళ్లు అయినా ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీ మోసాలను మరిచిపోలేదని, అందుకే ప్రజలు ఓడిరచారన్నారు. ్న దోపిడీ సొమ్ముతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్ప తెలంగాణ సోసైటీలో బీఆర్‌ఎస్ లేదని జూబ్లీహిల్స్ ఎన్నికతో తేలిపోయిందన్నారు. మీ బుదర రాజకీయాలకు ప్రజలు సమాధి కట్టారని, ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని హుందాగా రాజకీయాలు చేయాలని హితవు పలికారు. రాజకీయాలు అంటే రాద్దాంతం కాదు. రాజకీయం అంటే సిద్దాంతం. గెలుపోటములు సహజం. ఆ విషయాన్ని గ్రహించి రాష్ట్ర అభివృద్దికి సహకరించండి.. లేకపోతే మీ పార్టీ కనుమరుగు కావడం ఖాయం అని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





