నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ సాగర్‌ మాల

కేంద్ర షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రారంభం

న్యూఢల్లీి,జూన్‌ 26: భారతదేశపు మొట్టమొదటి నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ సాగర్‌ మాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ గురువారం ప్రారంభించారు. ఇది సముద్ర రంగంలో భారతదేశపు మొట్టమొదటి నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ. గతంలో సాగరమాల డెవలప్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు అమృత్‌ కాల్‌ విజన్‌ 2047కి అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఇది దేశ సముద్ర మౌలిక సదుపాయాల కల్పన, వాటి అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. ఇదో మినీ రత్న కంపెనీ. కేటగిరీ-ఎలో ఉన్న ఈ సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజ్‌ను జూన్‌ 19న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీగా గుర్తించింది. ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోన్న సముద్ర రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ సంస్థ ఎంతగానో దోహదపడుతుంది. ఈ సంస్థ మేరీ టైం రంగంలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. ఓడరేవులు, స్టార్టప్‌లు, ఇతర సంస్థలను శక్తివంతం చేసేందుకు కూడా ఈ సంస్థ ఆర్థిక సహకారం అందిస్తుంది. సముద్ర రంగంలో ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడంతో పాటు, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ªూఓఈఅఒ ఆర్థికంగా ఎంతో సపోర్ట్‌ ఇస్తుంది. ఈ కార్పొరేషన్‌ ద్వారా పోర్ట్‌ అథారిటీలు, షిప్పింగ్‌ కంపెనీలు, ఓªూఓఇలు, స్టార్టప్‌లు, మేరీ టైం ఇన్సిట్యూషన్స్‌ వంటి విభిన్న శ్రేణి సంస్థలకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక నిధులు సమక78రుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *