పరిశమ్రల్లో భద్రతపై అధికారులు దృష్టి పెట్టాలి

– పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల్లో భద్రతపై శిక్షణ 
– ప్రారంభించిన కార్మిక మంత్రి వివేక్‌ వెంకటస్వామి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘటన పరిశ్రమల యజమానులకు ఇది ఒక కేస్‌ స్టడీ వంటిదని కార్మిక, ఉపాధి కల్పనల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. డైరెక్టరీస్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీ దానికి సంబంధించిన ఒక నివేదిక ఇచ్చిందని, ఎక్కడ సమస్యలు, లోపాలున్నాయో పేర్కొందని, యాజమాన్యాల దృష్టికి కూడా తీసుకెళ్లిందని తెలిపారు. ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో కెమికల్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి శిక్షణ కార్యక్రమం జరగగా మంత్రి వివేక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిగాచి పరిశ్రమలో భద్రతకు అవసరమయ్యే ఖర్చు రూ.20 లక్షల కంటే ఎక్కువ దాటదని, ఆ మొత్తాన్ని ఖర్చు చేయడంలో యాజమాన్యంతోపాటు బోర్డు సభ్యుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగి 53మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలో భద్రతా వాతావరణం ఉన్నపుడే కార్మికులు పనిచేయగలుగుతారన్నారు. యాజమాన్యం ఎప్పుడూ కార్మికుడి భద్రత కోసం పెట్టుబడి పెట్టాలని సూచించారు. దానివల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఆయన చెప్పారు. ఇవాళ నిర్వహించిన శిక్షణ చాలామంచి కార్యక్రమమని, గుడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాక్టీస్‌ జీరో యాక్సిడెంట్‌ ఫ్యాక్టరీస్‌గా కంపెనీల్లో ప్రమాణాలు పెంచాలని, మేనేజ్‌మెంట్‌, వర్కర్స్‌ ఇనిషియేటివ్‌ కంటే సేఫ్టీ అధికారుల పాత్ర ముఖ్యమని అన్నారు. రాజకీయంగా కూడా సమస్యలు వస్తాయి.. ఏదో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.. మీరు జీరో యాక్సిడెంట్‌ ఉండేలా చూడాలి.. రెడ్‌ కేటగిరీ కంపెనీలను గుర్తించి నోటీసులు ఇస్తాం.. ఏదన్నా ప్రమాదం జరిగితే కార్మిక శాఖను బద్మామ్‌ చేస్తారు కాబట్టి మీరు పూర్తిస్థాయిలో సేఫ్టీ మీద దృష్టి పెట్టి మార్పులు చేయాలని మంత్రి వివేక్‌ ఆదేశించారు. ఫ్యాక్టరీల్లో భద్రతపై సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెలా ఒక రోజు కార్మికులకు భద్రత గురించి కొంత సమయం శిక్షణ ఇవ్వాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *