పిల్ల‌ల‌కు సుర‌క్షిత న‌గ‌రంగా హైద‌రాబాద్‌

– మంత్రులు సీత‌క్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్ హామీ
– క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్ ఆవిష్క‌ర‌ణ‌

హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్18: పిల్లలకు హైదరాబాద్ ను సురక్షిత నగరంగా మార్చుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో క్లాప్ ఫ‌ర్ ఛిల్డ్ర‌న్ పిల్లల భద్రత కోసం నగర స్థాయి కార్యాచరణ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం, యూనిసెఫ్ సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ సంద‌ర్భంగా క్లాప్ ఫర్ చిల్డ్రన్ పోస్టర్‌ను సచివాలయంలో గురువారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం హైదరాబాద్‌ను పిల్లలకి సురక్షిత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంద‌న్నారు. ఇతర నగరాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దామన్నారు. ఈ ప్రయత్నంలో యూనిసెఫ్ సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రణాళిక ద్వారా ప్రభుత్వ విభాగాలు, చట్టపరమైన సంస్థలు, సమాజం కలిసి పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి కృషి చేయనున్నారు. చట్టపరమైన సంస్థలు, ఫ్రంట్‌లైన్ సేవలను బలోపేతం చేసి, మహిళా- శిశు సంక్షేమ, పోలీసు, ఆరోగ్యం, విద్య, కార్మిక, జీహెచ్ఎంసీ వంటి విభాగాల సమన్వయంతో బుల్లీయింగ్, ఈవ్-టీజింగ్, అసురక్షిత రవాణా, మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించడానికి చర్యలు చేపడతారు. బాలల రక్షణ సెల్‌లు, విజిలెన్స్ కమిటీల ద్వారా డేటా ఆధారిత మానిటరింగ్ జరుగుతుంది. అలాగే ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, పిల్లలకు అనుకూలమైన,  శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో మహిలా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి  అనితా రామచంద్రన్, యూనిసెఫ్ చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ డా. జెలాలెం బిర్హాను టాఫెస్సే తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *