మహేశ్వరం, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 2: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై, కాళేశ్వరం ప్రాజెక్టుపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను బీఆర్‌ఎస్ పార్టీ నిరసించింది. ఈమేరకు బాలాపూర్ చౌరస్తాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలదండ వేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, పెండ్యాల నగేష్, పటేల్ సునీత రెడ్డి, కంచర్ల శేఖర్, న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, యాదమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




