– రూ.10,000 కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్
– మరింత పటిష్టం కానున్న భారత్ రక్షణ రంగం
న్యూదిల్లీ, ఫిబ్రవరి 13: భారత రక్షణరంగ పటిష్టత దిశగా మరో కీలక ముందడుగు పడింది. రష్యా నుంచి 288 ఎస్-400 క్షిపణుల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సుమారు రూ.10వేల కోట్ల ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో జరిగే ఈ కొనుగోళ్లలో 120 స్వల్పశ్రేణి క్షిపణలు, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణలు ఉన్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్ జరిగిన మరో రెండు ఎస్`400 వ్యవస్థలు జూన్, నవంబర్‌లో అందనున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉపయోగించిన క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడం, వాయు రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడం తాజా కొనుగోళ్ల ముఖ్య ఉద్దేశంగా డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. ఇదేవిధంగా చైనా, పాకిస్థాన్ సరిహద్దుల వద్ద భారత వాయు రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, 400 కి.మీ పరిధిలో వైమానిక ముప్ప్పును సమర్ధవంతంగా ఎస్-400 వ్యవస్థ అడ్డుకుంటుందని పేర్కొన్నాయి. పాకిస్థాన్‌తో గత ఏడాది తలెత్తిన ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ వ్యవస్థ శత్రువుల వెన్నులో చలిపుట్టించింది. 314 కి.మీ దూరంలోని పాక్ యుద్ధ విమానాన్ని కుప్పకూల్చింది. ఆదంపూర్, భుజ్ సెక్టార్లలో ఈ వ్యవస్థను మోహరించడంతో పాక్ గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ యుద్ధ విమానాలను ఆప్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం కొనుగోలు చేయనున్న 400 కి.మీ, 200 కి.మీ, 150 కి.మీ, 40 కి.మీ శ్రేణి క్షిపణులు శత్రువుల విమానాలు,డ్రోన్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టగలవు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





